వాస్తవాలను చూసి కాంగ్రెస్ భయపడుతోంది: నిర్మలా సీతారామన్

వాస్తవాలను చూసి కాంగ్రెస్ భయపడుతోంది: నిర్మలా సీతారామన్
x
Highlights

భారత్ కొనుగోలు చేసిన తొలి రాఫెల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరులో దేశానికి వస్తుందని చెప్పారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది.

భారత్ కొనుగోలు చేసిన తొలి రాఫెల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరులో దేశానికి వస్తుందని చెప్పారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె విమానాల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇచ్చారు. మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని, ఈ మొత్తం వ్యవహారం పూర్తవడానికి 14నెలల సమయం పట్టిందని ఆమె చెప్పారు. డిఫెన్స్‌ డీలింగ్స్‌కు.. డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని, తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని అన్నారు. దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు నిర్మలా సీతారామన్.

పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు రక్షణ సంబంధ విషయాల్లో దూకుడుగా ఉంటే, అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేవలం 18 యుద్ధవిమానాలను మాత్రమే కొనుగోలు చేసి, భారత్‌ను ఎటూ కదల్లేని స్థితికి తెచ్చిందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో తగిన సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దీన్ని అత్యవసరంగా గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో నిర్మలా సీతారామన్‌ వారికి గట్టిగానే చురకలంటించారు. తన సమాధానం వినేందుకు కూడా ప్రతిపక్ష సభ్యులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, యుద్ధ విమానాల కొనుగోలు దేశ భద్రతకు సంబంధించిన విషయమని అందరు గుర్తుంచుకోవాలన్నారు.

బెంగళూరు హెచ్‌ఏఎల్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు నిర్మలా సీతారామన్. హెచ్‌ఏఎల్‌కు ఎందుకు ఇవ్వలేదో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని, హెచ్‌ఏఎల్‌ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలని అన్నారు. తేజస్‌ విషయంలో హెచ్‌ఏఎల్‌ వేగంగా పనిచేయలేదన్నారు. హెచ్‌ఏఎల్‌ విషయంలో కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. తాము హెచ్‌ఏఎల్‌కు లక్ష కోట్ల రూపాయల ఒప్పందాలు అప్పగించామని చెప్పారు నిర్మలా సీతారామన్.

రాఫెల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ వ్యవహారంపై ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలేనని, జాతీయ భద్రతను కాంగ్రెస్‌ గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రధాని పట్ల అభ్యంతరకర పదజాలం వాడారని, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ను సైతం అబద్దాలకోరుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మెక్రాన్‌తో రాహుల్‌గాంధీ మాట్లాడలేదని కాంగ్రెస్‌ చెప్పిందని, మా హయాంలో హాల్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచామని ఆమె చెప్పారు. చాపర్ల కొనుగోలు సమయంలో హెచ్‌ఏఎల్‌ను పక్కన పెట్టారని, డసో, హెచ్‌ఏఎల్‌ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని అన్నారు. హెచ్‌ఏఎల్‌ ఏడాదికి 8 విమానాలకు మించి తయారు చేయలేదని, మీ హయాంలో హెచ్‌ఏఎల్‌ను పక్కన పెట్టి అగస్టాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.భారత్ కొనుగోలు చేసిన తొలి రాఫెల్ యుద్ధ విమానం 2019 సెప్టెంబరులో దేశానికి వస్తుందని చెప్పారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories