క్యూనెట్‌ గుట్టు రట్టు.. 58 మంది అరెస్టు

క్యూనెట్‌ గుట్టు రట్టు.. 58 మంది అరెస్టు
x
Highlights

డబ్బు ఆశ చూపి వేల సంఖ్యలో బాధితులకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ మోసగాళ్లను ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

డబ్బు ఆశ చూపి వేల సంఖ్యలో బాధితులకు కుచ్చుటోపి పెట్టిన క్యూనెట్ మోసగాళ్లను ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగులను, అమాయకులను ట్రాప్‌ చేసి చైన్ సిస్టమ్ ద్వారా ప్రైజ్ మనీ, కమీషన్లు వస్తాయంటూ నమ్మించి మోసాలకు పాల్పడిన 58 మంది కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి ఇచ్చిన పిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ అధికారులు మల్టీలెవల్ మార్కెట్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. సైబరాబాద్‌ పరిధిలో క్యూనెట్‌ మోసంపై 14 కేసుల నమోదయినట్టు పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. దేశవ్యాప్తంగా క్యూనెట్‌ బ్యాంకు అకౌంట్లను, గోదాంలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన 58 మందిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటికే క్యూనెట్‌ చైర్మన్‌ మైకెల్‌ ఫెరారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories