డెలివరీ బాయ్‌ని గదిలోకి లాక్కెళ్లి ...

డెలివరీ బాయ్‌ని గదిలోకి లాక్కెళ్లి ...
x
Highlights

ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెరివరీ బాయ్‌పై దాడి చేసిన యువతులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. షార్జా (అరబిక్) మూడవ అతిపెద్ద మరియు మూడవ అత్యధిక...

ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెరివరీ బాయ్‌పై దాడి చేసిన యువతులను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. షార్జా (అరబిక్) మూడవ అతిపెద్ద మరియు మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగం. ఇక వివరాల్లోకి వెళితే ఫుడ్ డెలివరీ చేయడానికి షార్జాలోని ఓ ఫ్లాట్‌కు డెలివరీ బాయ్ వెళ్లగా ఓ యువతి వచ్చి తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని తమ గదిలోకి తీసుకెళ్లింది. కాగా డబ్బులు ఇబ్బకుండానే గదిలోకి వెళ్లిపోయింది. అయితే ఎంత సేపటికి కూడా లోపలికి వెళ్లిన అమ్మాయి బయటికి రాకపోవడంతో డెలివరి బాయ్ బెల్ కొట్టాడు. ఆమె Dh200బిల్లును చెల్లించడానికి నిరాకరించింది. ఇదే సమయంలో గదిలోపడి నుండి అనేక మంది యువతులు వచ్చి ఆ డెలివరీ బాయ్‌ని బలవంతంగా లోపడికి లాక్కెళ్లారు. అనంతరం గదిలో ఉన్న లైట్లు అన్ని ఆపేసి డెలివరీ బాయ్‌‌ని కత్తితో బెదిరించి దాడి చేశారు.

డెలివరీ బాయ్‌ని గదిలోకి లాక్కెళ్లి లైట్లు ఆపేసి..ఆ యువకుడి దగ్గర ఉన్న ఫోన్‌, జేబులో ఉన్న డబ్బులు కూడా లాక్కున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ నేరుగా పోలీసుల జరిగింది అంతా చెప్పి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు యువతిని ఆమె స్నేహితురాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి దగ్గరి నుండి లాక్కున్న ఫోన్, డబ్బు తిరిగి ఇచ్చేస్తానంటూ యువతి పోలీసులకు తెలిపింది. ఈ కేసు విచారణ మే 20కు వాయిదా పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories