Top
logo

ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా 325 మంది పిల్లల్ని రక్షించాం

ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా 325 మంది పిల్లల్ని రక్షించాం
X
Highlights

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు....

బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. 'ఆపరేషన్ స్మైల్'లో భాగంగా పలు పరిశ్రమలు, దుకాణాలపై దాడులు చేసి 325 మంది చిన్నారులను కాపాడినట్లు చెప్పారు. వీరిలో 11 మంది బాలికలు కూడా ఉన్నారు. 272 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించగా 53 మంది చిన్నారులను బాలసదన్‌లో చేర్పించినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు యజమానులకు 6.75 లక్షలు జరిమానా విధించినట్లు సీపీ తెలిపారు. కొంతమంది దళారులు బిహార్, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు పక్కదేశమైన నేపాల్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి పనిలో పెడుతున్నారని చెప్పారు.

Next Story