హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత...రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్న...

హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత...రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్న...
x
Highlights

డబ్బు కట్టులు తెంచుకుంటోంది. నేతల కలుగుల్లో ఉన్న నగదు ఓటరు దేవుడి దగ్గరికి పరిగెడతానంటోంది. అవును ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు...

డబ్బు కట్టులు తెంచుకుంటోంది. నేతల కలుగుల్లో ఉన్న నగదు ఓటరు దేవుడి దగ్గరికి పరిగెడతానంటోంది. అవును ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్‌లో నిన్న రాత్రి భారీ మొత్తంలో ఏపీకి చెందిన నేత డబ్బు పట్టుబడగా విజయవాడలో హవాలా సొమ్ము దొరికడం సంచలనం రేపింది.

ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర రెండు కోట్ల నగదును ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ఈ నగదును రాజమండ్రికి తీసుకెళ్తుండగా సీజ్ చేశారు.

హైదరాబాద్‌లో దొరికిన డబ్బు రాజమహేంద్రవరంలో ఎంపీగా పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీ నేతదిగా గుర్తించారు. ఆ అభ్యర్థికి చెందిన హైదరాబాద్‌లోని వ్యాపార కార్యాలయం నుంచి రాజమండ్రికి ఇద్దరు వ్యక్తులు డబ్బు తరలిస్తూ దొరికిపోయారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎన్నికల సమయంలోనే విజయవాడలో కోటీ 36 లక్షల హవాల సొమ్ము పట్టుబడింది. ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన అభినవ్‌రెడ్డి 12 కంపెనీలు స్థాపించి వ్యాపారం నిర్వహిస్తుండగా తాజాగా మిర్చిని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. అభినవ్ రెడ్డి దగ్గర పనిచేసే నాగరాజుపై దాడి చేసి మొత్తం కోటీ 36 లక్షల కాజేసింది అతడి మిత్రబృందం. చెన్నై రైల్వే స్టేషన్‌ సమీపంలో డబ్బును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సీజ్‌ చేయడంతో హవాలా గుట్టు రట్టయ్యింది. అయితే ఎన్నికలకు ఈ డబ్బులకు సంబంధం లేదని అంటున్నా ఈ హవాలా రాకెట్‌ కు రాజకీయనేతలకు లింక్ ఉందని అనుమానిస్తున్నారు.

అటు హైదరాబాద్ అబ్దుల్లా పూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ తనిఖీల్లో 45 లక్షల రూపాయలను సీజ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నేత కారు వెనుక సీటు భాగంలో డబ్బు తరలిస్తుండగా రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ నుండి నల్గొండ వైపు వెళ్తున్న సమయంలో ఈ నగదు పట్టుబడింది. అలాగే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో జరిపిన సోదాల్లో 70 లక్షల నగదు లభ్యమైంది. కొత్తపేట పంచాయతీ పరిధిలోని ప్రసాద్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు వసతిగృహంపై పోలీసులు దాడి చేయగా వసతి గృహంలో బీరువాలో ఉన్న 70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories