ఎమ్మెల్యే సీతక్క కారు బీభత్సం.. మూడేళ్ల చిన్నారి మృతి

ఎమ్మెల్యే సీతక్క కారు బీభత్సం.. మూడేళ్ల చిన్నారి మృతి
x
Highlights

ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కారు ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా చిన్నారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయాలయ్యాయి....

ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కారు ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా చిన్నారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం శివారులోని జీడివాగు సమీపంలో శనివారం (మే 18) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దంపతులు తమ చిన్నారిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా జీడివాగు సమీపంలో ఎదురుగా దూసుకొచ్చిన ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. గాయపడిన దంపతులను ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













Show Full Article
Print Article
Next Story
More Stories