టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

Athram Sakku
x
Athram Sakku
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అత్రం సక్కు పార్టీమారనున్నారా. అత్రం సక్కు చేయి విడిచి కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారా.?...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే అత్రం సక్కు పార్టీమారనున్నారా. అత్రం సక్కు చేయి విడిచి కారు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారా.? పార్టీ వీడేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు చర్చించినట్లు వస్తున్న వార్తలో నిజమెంత కారు పార్టీలో చేరడానికి అత్రం సక్కు పార్టీ పెద్దల ముందు పెట్టిన డిమాండ్లు ఎంటి..? అసిపాబాద్ లో మారుతున్నా రాజకీయ సమీకరణ లపై హెచ్ ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అసిపాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు అసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా అత్రం సక్కు విజయం సాధించారు. అయితే అత్రం సక్కుపై టీఆర్ఎస్ నేతలు గురిపిట్టినట్లు తెలుస్తోంది. పార్టీ మారే విషయంలో ఇప్పటికే సక్కుతో పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. సక్కు సైతం పార్టీ మారడానికి సానుకూలంగా ఉన్నాడని జిల్లా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు దృవీకరిస్తున్నాయి.

ఇక పార్టీ మారితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని సక్కు డిమాండ్ చేస్తునట్లు సమాచారం. ఇక వైఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించిన ఎకైక ఎమ్మెల్యేగా సక్కు నిలిచినా క్యాబినేట్ లో చోటు దక్కలేదు. అప్పట్లో సక్కు తీవ్ర నిరాసకు గురయ్యారు. ఇక టీఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేసి మంత్రి పదవి ఇస్తామంటే పార్టీ మారే అవకాశం ఉందని నియోజక వర్గంలో వార్తలు వినిపిస్తున్నాయి మరోకవైపు అత్రం సక్కు పార్టీ మారితే మరికోంత మంది అదివాసీ ఎమ్మెల్యేలు సక్కుబాట లో నడటానికి సిద్దంగా ఉన్నారు.. దీనితో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు సక్కుని టీఆర్ఎస్ లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా అత్రం సక్కు పార్టీలోకి చెర్చుకోవద్దనిమండలాల వారిగా తీర్మాణాలు చేపట్టారు. పదమూడు మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు సక్కు పార్టీలోకి తీసుకోవద్దని కోరుతూ తీర్మాణాలు చేశారు. ఈ తీర్మాణాలను పార్టీ కి కార్యాయాలానికి పంపారు. సక్కు రాకుండా కోవలక్ష్మి రాకుండా గట్టి ప్రయత్నాలు చేస్తునట్లు సమాచారం అయితే పార్టీ పెద్దలు మాత్రం సక్కు పార్టీలోకి వస్తారని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories