Top
logo

భట్టి ముందే బాహాబాహీ!

భట్టి ముందే బాహాబాహీ!
X
Highlights

హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎల్పీ నేత సన్మాన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గ్రేటర్...

హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎల్పీ నేత సన్మాన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్, వీహెచ్ వర్గీయుల మధ్య బాహాబాహీ జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీహెచ్ అంబర్ పేట టీకెట్ రాకుండా అడ్డుకున్నారని శ్రీకాంత్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సహనం కోల్పోయిన వీహెచ్‌ వారిపై దుర్భాషలాడారు. దీంతో శ్రీకాంత్‌ అనచరులు వీహెచ్‌పైకి దూసుకెళ్లారు. అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీహెచ్‌ వర్గీయులు కూడా దూసుకురావడంతో సమావేశం రచ్చ రచ్చైంది. ఇరువర్గాల కార్యకర్తలను సీనియర్‌ నేతలు శాతింపజేస్తున్నారు.

Next Story