ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌బాబు అరెస్టు

ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌బాబు అరెస్టు
x
Highlights

సీఎల్పీని తెరాసలో విలీనం చేసే ప్రక్రియను తీవ్రంగా నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎల్పీ విలీనం...

సీఎల్పీని తెరాసలో విలీనం చేసే ప్రక్రియను తీవ్రంగా నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎల్పీ విలీనం కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవడాన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డితో పాటు పార్టీ నేతలు మల్లురవి, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఇతర నేతలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడినుంచి టపాచబుత్ర పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చల విడిగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ టీఆర్‌ఎస్ రాజకీయ వ్యభిచారం చేస్తోందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ దిగజారుడు రాజకీయాలను ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయ విచ్చలవిడితనంపై స్పందించాలని ప్రజాస్వామ్య వాదులకు, మేధావులకు కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories