పాత వ్యూహాలతో పాటు కొత్త వ్యూహాలు అమలు

kcr
x
kcr
Highlights

రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. రాష్ట్ర్ర వ్యాప్త్తంగా జిల్లా ఇంచార్జులను నియమించేందుకు పార్టీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు.

రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. రాష్ట్ర్ర వ్యాప్త్తంగా జిల్లా ఇంచార్జులను నియమించేందుకు పార్టీ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంచార్జులగా పనిచేసిన వారినే పార్లమెంటు ఎన్నికల్లో నిమమించాలని భావిస్తున్నారు. నియోజక వర్గంలో పార్టీ పనితీరుపై పట్టు సాధించడంతో కొత్త వారిని నియిమించడం కంటే పాతవారితో సమర్ధవంతగా పనిచేయించి మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. కొత్త వ్యూహాలు అమలు చేయాలని చూస్తోంది. అందుకు ఇప్పుడు పార్టీ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం రద్దైన జిల్లాల కమిటీలకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు. జిల్లా ఇంజార్జీల స్థానంలో గతంలో నియోజక వర్గ ఇంచార్జులను నియమిస్తామని గులాబీ బాస్ ప్రకటించారు. నియోజక వర్గ ఇంచార్జ్ కంటే జిల్లా ఇంచార్జులే బెటర్ అనే అలోచనకు టీఆర్ఎస్ నాయకత్వం వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ప్రతి నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యేలే నియోజక వర్గ ఇంచార్జులుగా ఉన్నారు. పార్టీ ఓటిమి పాలైన నియోజక వర్గాల్లో ఓడిపోయిన అభ్యర్దులే ఇంకా నియోజక వర్గ ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్లీ నియోజక వర్గ ఇంచార్జులు నియామకం చేస్తే పార్టీలో గ్రూపులకు ఆజ్యం పోసినట్టు ఉంటుందని భావిస్తోంది గులాబి పార్టీ అధిష్టానం. అందుకే నియోజక వర్గ ఇంచార్జుల నియామకాన్ని పక్కన బెట్టి జిల్లా ఇంచార్జులు నియామకం చేయాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది. 33 జిల్లాలకు ఇంచార్జులను నియమించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లా ఇంచార్జులుగా సమర్దవంతంగా పనిచేసిన వారికి ఈసారి కూడా మళ్లీ భాద్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గులాబీ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. జాతీయ స్థాయిలో ఫెడరల్ ప్రెంట్ పేరుతో కేసీఆర్ కీలకంగా వ్యవహారించాలని బావిస్తున్న వేళ రాష్ట్రంలో 17 స్థానాల్లో 16 స్థానాలు గెలిచి సత్తా నిరూపించు కోవాలని బావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం లోపం, బేదాభిప్రాయాల వల్ల కొన్ని కీలక స్థానాల్లో పార్టీ ఓటమిని చవిచూసింది. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జిల్లా ఇంచార్జుల నియామకం నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అందరిని కలుపుకొని పోయి సమర్దవంతంగా పనిచేసే నేతలకు ఇంజార్దీ భాద్యతలు అప్పగించి సత్పలితాలు సాధించాలని యోచిస్తున్నారు. పార్టీ అధినేత సూచనలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకోసం పూర్తి స్థాయి కరసత్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేసిన నేతలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో నాన్ లోకల్ నేతలను నియోజక వర్గ ఇంచార్జుగా నియమించారు. వారు దాదాపు రెండు మూడు నెలలు నియోజక వర్గంలో మకాం వేసి పార్టీ అభ్యర్దుల గెలుపుకు కృషి చేసారు. మళ్లీ అలాంటి కీలక నేతలకే పార్లమెంటు ఎన్నికల భాద్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలను తెలంగాణ భవన్‌కు పిలిపించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. జిల్లాల్లో నియోజక వర్గాల వారీగా ఎక్కడెక్కడ నేతల మద్య సమన్వయ లోపం ఉందో ఇప్పుటికే పార్టీ అధినేత రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఈ గ్రూపులు పార్టీ అభ్యర్దులు విజయం పై ప్రభావం చూపకుండా పార్లమెంటు నియోజక వర్గ ఇంచార్జులకే భాద్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ తర్వాతే పార్టీ పదవులు భర్తీ చేసి పార్లమెంటు ఎన్నికల కార్యాచరణ రూపొందించాలని బావిస్తున్నారు గులాబి నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories