అప్పుడూ 12.. ఇప్పుడూ 12..

అప్పుడూ 12.. ఇప్పుడూ 12..
x
Highlights

సీఎం కేసీఆర్ కు వాస్తు, లక్కీ నంబర్, ముహూర్తం అంటే ఎంత సెంటిమెంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్ గతంలో కొనసాగించిన...

సీఎం కేసీఆర్ కు వాస్తు, లక్కీ నంబర్, ముహూర్తం అంటే ఎంత సెంటిమెంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణలోనూ కేసీఆర్ గతంలో కొనసాగించిన సాంప్రదాయాన్నే ఫాలో అయ్యారు. గత ప్రభుత్వంలో మొదట కేబినెట్ మంత్రులు 12 మంది ఉండే వారు. ఇప్పడు, మంత్రి వర్గ విస్తరణతో తాజాగా మంత్రుల సంఖ్య సీఎంతో కలిపి 12కు చేరింది.

కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ గతంలో అనుసరించిన సెంటిమెంట్ నే కొనసాగించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత, 2014లో ఏర్పాడిన తొలి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తో పాటు మొత్తం 12మందికి అప్పటి మంత్రివర్గంలో చోటు దక్కింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా తొలి విడత విస్తరణలో 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ప్రసుత్తం కేబినెట్ లో మంత్రుల సంఖ్య సీఎంతో కలిపి మొత్తం 12కు చేరింది.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో తెలంగాణ తొలి మంత్రివర్గంలో మొత్తం 12మంది మంత్రులు ఉన్నారు. అనంతరం జరిగిన కేబినెట్ విస్తరణలో మరో ఆరుగురికి చోటు దక్కడంతో మంత్రుల సంఖ్య సీఎంతో కలిపి 18కి చేరింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో సీఎం కేసీఆర్ గత ఏడాది డిసెంబరు 13న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో కేసీఆర్ తో పాటు మహ్మద్ అలీ మాత్రమే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సుమారు రెండు నెలల తర్వాత, మళ్లీ ఇప్పుడు కేబినెట్ విస్తరణ జరిగింది. తొలి విడత విస్తరణలో మరో 10మందికి మంత్రులుగా బెర్త్ లు దక్కాయి. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. దీంతో తెలంగాణ కేబినెట్ మంత్రుల సంఖ్య పన్నెండుకు చేరింది. దీంతో గులాబీ బాస్, గతంలో అనుసరించిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories