Top
logo

సమరానికి సిద్ధం

సమరానికి సిద్ధం
X
Highlights

ఐదేళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు...

ఐదేళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యామని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటే తమపైనే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌ అసెంబ్లీకి రారని భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశమే లేదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చామన్నారు.

విభజన హామీలు నెరవేర్చాలని పోరాడితే దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తుందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌ అసెంబ్లీకి రారని భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశమే లేదన్నారు. రాష్ట్రంపై కుట్రలు చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలతో గడచిన ఐదేళ్లలో ప్రజలకు చేరువయ్యామని చంద్రబాబు అన్నారు. ఓ విజన్‌ తో ముందుకెళ్తున్నామన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Next Story