logo

బందిపోట్లకు ఆయన నాయకుడు: చంద్రబాబు

బందిపోట్లకు ఆయన నాయకుడు: చంద్రబాబు

ఏపీకి అన్యాయం జరిగితే ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు సీఎం చంద్రబాబు. కర్నూలు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన జగన్, కేసీఆర్, మోడీ, ప్రశాంత్‌కిషోర్‌లపై నిప్పులు చెరిగారు. పీకే ఓ పెద్ద నేరస్తుడని, బందిపోటు ముఠాలకు నాయకుడని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిపై కేసులు పెడుతూ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. జగన్ పుణ్యమాని ఐఏఎస్ అధికారులు, వ్యాపారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మరోవైపు మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని, ఆయన దొంగలను కాపాడుతూ నీతివంతులపై దాడులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు.

లైవ్ టీవి

Share it
Top