ఖాకీ కొలువుపై ఇష్టం ఉన్నవారికి పోలీస్ శా‌ఖ ఉచిత శిక్షణ

City Police
x
City Police
Highlights

నేనేరా పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీయువకులు కలలుగంటారు. ఇలాంటి యువత కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తుంది.

నేనేరా పోలీస్ అని చెప్పుకునేందుకు కొందరు యువతీయువకులు కలలుగంటారు. ఇలాంటి యువత కలను నిజం చేసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తుంది. రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ కు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. తమ వద్ద ట్రైనింగ్ తీసుకున్నవారికి కొలువు ఖాయమంటోంది. ప్రాక్టీస్ చేస్తున్న వీరు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులు. ప్రీలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన వీరు ఫిజికల్ ఈవెంట్ లో సక్సెస్ కోసం సాధన చేస్తున్నారు. ఖాకీ కొలువుపై ఇష్టం ఉన్నవీరికి తెలంగాణ పోలీసు శాఖ ఉచితంగా శిక్షణ ఇస్తోంది.

గత జూన్ లో 16,500 పోస్టులతో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. లక్షలాది మంది యువతీయువకులు దరఖాస్తులు చేసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలకు హైదరాబాద్ లో పలు ఇన్ స్టిట్యూట్లు కోచింగ్ ఇస్తున్నాయి. కానీ వాటికి ఫిజికల్ టెస్ట్ శిక్షణ ఇచ్చేందుకు గ్రౌండ్లు లేవు. పోలీసు ఉద్యోగంపై మక్కువ ఉన్న యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ హోంశాఖ 2015 లో హైదరాబాద్ లో Pre Recruitment Training ను ఏర్పాటు చేసింది. రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్ ను ఉచితంగా కోచింగ్ ఇస్తుంది. గోషా మహాల్ స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్ కోసం శిక్షణ ఇస్తున్నారు.

గోషామహాల్ పోలీస్ స్టేడియంలో 4 వేల మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయం 3 గంటలు ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్, సాయంత్రం వేళ రాత పరీక్ష కోసం వివిధ సబ్జెక్ట్ లను బోధిస్తున్నారు. ఈ రెండు విభాగాలకు పోలీస్ శాఖలో ప్రతిభావంతులైన ఉద్యోగులు శిక్షణ ఇస్తున్నారు. Pre Recruitment Trainingపై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల ఫీజు కట్టిన ఇంత మంచి కోచింగ్ దొరకదు అంటున్నారు. పోలీస్ శాఖ తోడ్పాటుతో జాబ్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గత పోలీస్ రిక్రూట్ మెంట్ లో Pre Recruitment Training ద్వారా 400 మందికి పోలీస్ ఉద్యోగాలు దొరికాయి. ఈ సారి కూడా వేలాది మందికి జాబ్ లు ఖాయమంటున్నారు పోలీసు అధికారులు. పేద అభ్యర్థులకు Pre Recruitment Training వరం అని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోంశాఖ పని తీరు మారింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట ప్రజలతో మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఖాకీ కొలువుపై ఇష్టమున్న యువతకు ఎంకరేంజ్ చేస్తున్నారు. మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నారు. ఖాకీ కొలువుపై ఇష్టమున్న యువత Pre Recruitment Training లో చేరి కలను నిజం చేసుకోవాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories