Top
logo

అమ్మో..చిరుత పులులు..

అమ్మో..చిరుత పులులు..
X
Highlights

అడవుల్లో సంచరించాల్సిన వన్య మృగాలు గ్రామాల బాటపడుతున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చిన చిరుతల ఆనవాళ్లు కనిపించడంతో జనం హడలెత్తిపోతున్నారు.

అడవుల్లో సంచరించాల్సిన వన్య మృగాలు గ్రామాల బాటపడుతున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడవుల నుంచి గ్రామాల్లోకి వచ్చిన చిరుతల ఆనవాళ్లు కనిపించడంతో జనం హడలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయ పడుతున్నారు. అడవులో జీవించాల్సిన వన్యప్రాణులు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొర్కపోవడంతో చిరుత పులులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు అటవీ సరిహద్దు గ్రామాల్లోకి తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటవీ జంతువుల కదలికలతో జనం హడలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు.

తాజాగా నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారంతో టెన్షన్ వాతావరణ నెలకొన్నది. మాక్లూర్ మండలం గుత్ప శివారులో చిరుత కలకలకం సృష్టించింది. ఓ రైతు పోలంలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు చిక్కి విలవిలలాడింది...కాలు కంచెలో ఇరుక్కోవడంతో పంట చేను వైపు వెళ్లిన రైతులు చూసి భయందోళనకు గురయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అదికారులు చిరుత పులి చుట్టూ వలను ఏర్పాటు చేశారు. చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. కంచె లోంచి బయటపడ్డ చిరుత అక్కడి నుంచి పరారైంది. చిరుత అడవిలోకి వెళ్లిపోయిందా? లేదంటే గ్రామ పరిసరాల్లోనే దాక్కుందా అన్న భయంతో గ్రామస్తులు కలవరపడుతున్నారు.

అదిలాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు గ్రామాల్లో అప్పుడప్పుడు చిరుత పులులు హల్ చల్ చేస్తున్నాయి. జనాన్ని భయకంపితలను చేస్తున్నాయి. మూగజీవాలపై విరుచుకుపడి చంపేస్తున్నాయి. చిరుత పులలు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు కూడా నిర్ధారించడంతో జనం భయంతో వణుకుతున్నారు. ఒంటరిగా వెళ్లాలంటేనే భయమేస్తుందంటున్నారు ప్రజలు. అడవుల్లో ఆహారం, నీరు దొరకక పోవడంతోనే జనజీవన ప్రదేశాల్లోకి పులులు, చిరుతలు వస్తున్నాయని అటవీ శాఖ అదికారులు చెబుతున్నారు. అడవికి దగ్గరగా ఉన్న గ్రామాల ప్రజలు పశువుల పాకలు, మేక దొడ్లపై దాడిచేసే అవకాశం ఉన్నందున రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Next Story