Top
logo

గద్వాలలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

గద్వాలలో చెడ్డీ గ్యాంగ్ కలకలం
X
Highlights

ఇప్పటివరకు రాజధాని హైదరాబాద్ వాసులను హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ తాజాగా గద్వాలలోనూ హల్‌ చల్ చేసింది.

ఇప్పటివరకు రాజధాని హైదరాబాద్ వాసులను హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ తాజాగా గద్వాలలోనూ హల్‌ చల్ చేసింది. పట్టణంలోని వేణు అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్‌ దొంగతనానికి యత్నించింది. నిన్న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సీసీ కెమెరాలు తొలగించి ఐదుగురు దొంగలు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. తాళం వేసిన ఇళ్లు లేకపోవడం, డొర్‌ కొట్టినా చాలా మంది తీయక పోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా చెడ్డీ గ్యాంగ్‌ పనిగా గుర్తించిన పోలీసులు శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు ఏకంగా పట్టణంలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story