అవినీతి పరులు, నేరస్తులే వైసీపీలోకి వెళ్తున్నారు

అవినీతి పరులు, నేరస్తులే వైసీపీలోకి వెళ్తున్నారు
x
Highlights

టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతల వలసలపై వ్యాఖ్యలు చేశారు. నీతి,నిజాయితీ గలవాళ్లే టీడీపీలో చేరుతున్నారన్న చంద్రబాబు...

టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతల వలసలపై వ్యాఖ్యలు చేశారు. నీతి,నిజాయితీ గలవాళ్లే టీడీపీలో చేరుతున్నారన్న చంద్రబాబు అవినీతి పరులు, నేరస్తులే వైసీపీలోకి పోతున్నారని అన్నారు. నేర రాజకీయాలతో సమాజానికి నష్టమన్నారు. ఇక స్వార్ధం కోసం వచ్చినవారే తెలుగుదేశాన్ని వీడారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చాలా మంది నేతలు దశాబ్దాల వైరాన్ని వీడి టీడీపీలో కలసి పని చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే ఉద్దేశంతోనే నేతలంతా విభేదాలు మరచి టీడీపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని చంద్రబాబు అన్నారు.

కర్నూలులో కోట్ల, కేఈ కుటుంబాలు, కడపలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు, విజయనగరంలో బొబ్బిలి, గజపతి రాజులు, అరకులో కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల రాజులు అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీలో కలసిపని చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని టీడీపీ నేతలు వ్యక్తిగత విభేదాలకు స్వస్తి చెప్పాలని చంద్రబాబు హితవు పలికారు. ఇది కలిసి పనిచేయల్సిన సమయమని అన్నారు. అలాగే వైఎస్ కుటుంబమే బాక్సెట్ తవ్వకాలకు సూత్రధారని ఆరోపించారు. బాక్సైట్ లైసెన్సులను రద్దు చేసిన ఘనత టీడీపీదేనన్న చంద్రబాబు వైసీపీ ముసుగు తొలగించాల్సింది గిరిజనులేనని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories