logo

బీజేపీ దాడులను ఖండించిన చంద్రబాబు

బీజేపీ దాడులను ఖండించిన చంద్రబాబు
Highlights

పశ్చిమబెంగాల్‌లో నిన్న జరిగిన హింసపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బీజేపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు...

పశ్చిమబెంగాల్‌లో నిన్న జరిగిన హింసపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. బీజేపీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో బలం లేని బీజేపీ మమత సర్కారుకు చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించిందని ప్రభుత్వాన్ని బలహీనపర్చాలనే ఉద్దేశ్యంతోనే అమిత్‌ షా దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడలేదనే బీజేపీ గూండాలను దించిందని హింస ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటున్నారని ట్విట్టర్‌లో వరుసగా ట్వీట్లు చేశారు. గుజరాత్‌లా ఈ దేశం మోడీ షా ల ద్వయాన్ని మోసేందుకు సిద్ధంగా లేదని అన్నారు. అమిత్‌షాను అడ్డుపెట్టుకుని ప్రధాని ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ట్విట్టర్‌లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లైవ్ టీవి

Share it
Top