logo

ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్..

ఢిల్లీలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్..
Highlights

చైన్‌ స్నాచింగ్‌లు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు చైన్‌ స్నాచర్లు...

చైన్‌ స్నాచింగ్‌లు దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు చైన్‌ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో ఓ మహిళ మెడలోని చైన్‌ను లాక్కుపోయారు. దీంతో ఆమె మెడపై గాయాలయ్యాయి. దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో మొత్తం రికార్డయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

లైవ్ టీవి

Share it
Top