ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుది నిర్ణయం: రజత్‌కుమార్

ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుది నిర్ణయం: రజత్‌కుమార్
x
Highlights

కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ సీఈవో రజత్‌కుమార్ అన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హళ్లను...

కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ సీఈవో రజత్‌కుమార్ అన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి రెండు కౌంటింగ్ హళ్లను ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ జరుగుతుందన్న రజత్‌కుమార్‌ ఒక్కో నియోజకవర్గానికి 36 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.

ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుందని, అయితే ముందుగా పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అలాగే ఐదు వీవీప్యాట్లను ఎంపిక చేసి వాటిని ఈవీఎమ్ లెక్కలతో సరిచూస్తామన్నారు. ఇక కౌంటింగ్ ప్రక్రియలో 6వేల 745 మంది సిబ్బందిని వినయోగిస్తున్నట్లు రజత్ కుమార్ వెల్లడించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. స్టేట్‌ వైడ్‌ 35 ప్రాంతాల్లో 126 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌‌లో 6 సెగ్మెంట్లలో లెక్కింపు ఉంటుందన్నారు. అలాగే సువిధ పోర్టల్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుది నిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదని రజత్‌కుమార్‌ స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లలో తేడా రాలేదని, ఒకవేళ వీవీ ప్యాట్‌లో మాక్‌ పోలింగ్ స్లిప్పులు క్లియర్‌ చేయకపోతేనే తేడా వస్తుందన్నారు. ఈవీఎమ్‌లు, 17సీలో సమానంగా ఓట్లు వచ్చి వీవీప్యాట్‌ స్లిప్పుల్లో తేడా వస్తే మరోసారి స్లిప్పులు లెక్కింపు చేపడతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories