ముగిసిన కేంద్ర కేబినేట్‌ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకున్న తొలి సమావేశం

ముగిసిన కేంద్ర కేబినేట్‌ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకున్న తొలి సమావేశం
x
Highlights

రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పార్లమెంట్‌ సౌత్‌ బ్లాక్‌లో కేంద్రమంత్రివర్గం తొలిసారిగా సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు...

రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పార్లమెంట్‌ సౌత్‌ బ్లాక్‌లో కేంద్రమంత్రివర్గం తొలిసారిగా సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత రక్షణ నిధి ద్వారా ఉపకార వేతనాలు ఇచ్చే కార్యక్రమంపై సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2 వేలుగా ఉన్న బాలుర స్కాలర్‌షిప్‌లను.. 2 వేల 500 లకు పెంచారు. అలాగే బాలికలకు 2 వేల 250 నుంచి 3 వేలకు పెంచారు. ఇప్పటి వరకు కేంద్ర పారామిలటరీ బలగాలకు మాత్రమే అందిస్తున్న ఉపకార వేతనాలను రాష్ట్ర పోలీసు విభాగానికి కూడా వర్తించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి రాష్ట్రం నుంచి 500 మంది రాష్ట్ర పోలీసు విభాగం పిల్లలను ఎంపిక చేసి వారికి ఉపకార వేతనాలు అందిస్తారు. వీటన్నింటికి కేంద్ర హోంశాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories