Top
logo

అవుటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

అవుటర్‌పై కారు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
X
Highlights

సంగారెడ్డి జిల్లాలో ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ...

సంగారెడ్డి జిల్లాలో ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. మేడ్చల్ నుంచి పఠాన్ చెరు వైపు వెళ్తున్న కారు అమిన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ సమీపం చేరుకోగానే మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తుంది. రిజిస్టేషన్‌ నంబర్‌ను(TS 07 GM 4666) బట్టి ఈ వాహనం మియాపూర్‌కు చెందిన శ్రీదేవి పేరు మీద ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story