కోట్ల చేరికతో కాంగ్రెస్‌ కోట బద్దలవుతుందా!!

కోట్ల చేరికతో కాంగ్రెస్‌ కోట బద్దలవుతుందా!!
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లాతో పాటు రాయలసీమలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉంటూ...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జిల్లాతో పాటు రాయలసీమలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్న కోట్ల కుటుంబం పార్టీని వీడాలని నిర్ణయించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచర, సహచర వర్గాలు కలిగిన కోట్ల కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో భవిష్యత్ పరిణామాలపై అంచనా వేస్తున్నారు.

కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి రాకకు ఇప్పటికే సీఎం చంద్రబాబు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. కోట్ల కోరినట్టు కర్నూలు ఎంపీ సీటు ఇచ్చేందుకు అంగీకరించిన చంద్రబాబు ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బుట్టా రేణుకతో చర్చలు జరిపారు. పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా అవకాశమిస్తామని బుట్టా రేణుకకు హామి ఇచ్చారు. ఇదే సమయంలో కోట్ల రాకను తీవ్రంగా వ్యతిరేకించిన కేఈ కుటుంబ సభ్యులతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. పార్టీ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్న కారణంగా సహకరించాలంటూ కోరారు.

పార్టీ వీడేందుకు సిద్ధమైన కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి అనుచరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. కోట్ల వెంటే తామూ నడుస్తామంటూ అనుచరగనం స్పష్టం చేసింది. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్‌ వెంట నడిచేందుకు సిద్ధమైన నేతలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.

2004 ఎన్నికల్లో ఒక్క స్ధానానికి పరిమితమైన టీడీపీ, 2009లో రెండు స్ధానాలు, 2014లో మూడు స్ధానాలు మాత్రమే గెలుచుకుంది. కోట్ల కుటుంబం రాకతో కర్నూలు జిల్లాలోని మెజార్టీ స్ధానాలు కైవసం చేసుకుంటామని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories