ఈరోజు (మే-18-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.




Show Full Article

Live Updates

  • 18 May 2020 10:03 AM GMT

    క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే రైలు టికెట్‌ ఐఆర్‌సీటీసీ నిర్ణయం

    న్యూఢిల్లీ : ఇకపై క్వారంటైన్‌కు ఒప్పుకున్న వారికే ప్రత్యేక రైళ్ల టికెట్లు జారీ చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో అంగీకారం తెలపాలి. లేదంటే టికెట్‌ బుకింగ్‌ వీలుకాదు. 14న ప్రత్యేక రైలులో బెంగళూరు విజయవాడ వెళ్లిన కొందరు క్వారంటైన్‌కు ససేమిరా అనడంతో ఐఆర్‌సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

  • 18 May 2020 10:02 AM GMT

    పెనుతుఫాన్ గా మారిన యాఫిన్

    *విశాఖ *

    పెనుతుఫాన్ గా మారిన యాఫిన్ అతితీవ్రతుఫాను

    *ఉత్తర ఓడిస్సా-వెస్ట్ బెంగాల్ కు ఎల్లో మెసేజ్ జారీ *

    గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూన్న పెనుతుఫాన్

    పారదీప్ కు 860,వెస్ట్ బెంగాల్ ధీఘా కు 980 బంగ్లాదేశ్ ఖేపూరాకు 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం

    అన్ని ప్రదాన ఓడ రేపు లకు రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ

    మత్స్యకారుల వేటకు వెళ్ళరాదు

    20వ తేదీ వెస్ట్ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం.

  • 18 May 2020 9:06 AM GMT

    ప్రభుత్వం అనుమతిస్తే 24 గంటల్లో ఆర్టీసీ సర్వీసులు

    లాక్‌డౌన్‌ నాలుగో దశ సడలింపుల్లో భాగంగా రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయం పరిపాలనా భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

    - మరిన్ని వివరాలు 

  • 18 May 2020 9:05 AM GMT

    ఆటో డ్రైవర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

    ఏపీలో ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవ‌ర్ల‌కు రెండో విడ‌త ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్న‌ట్లు ర‌వాణాశాఖ మంత్రి పేర్నీనాని వెల్ల‌డించారు. 'వాహన మిత్ర'కింద వారంద‌రికి సాయం చెస్తున్న‌ట్ల ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం వైఎస్ జగన్ జూన్ 4న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని తెలిపారు.

    - మరిన్ని వివరాలు 

  • 18 May 2020 9:01 AM GMT

    సీఎం జగన్ పాలనపై మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆసక్తికర వ్యాఖ్యలు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఇంట‌ర్యూలో మాట్లాడుతూ.. జగన్ అధిక ఆస్తుల‌ కేసు దర్యాప్తు స‌మ‌యంలో ఆయన తనకు ఎయిర్ పోర్టులో ఎదురుప‌డ్డార‌ని, నమస్కారం అంటే నమస్కారం చేశార‌ని ఆసక్తికర విషయాలు చప్పారు.

    - మరిన్ని వివరాలు 

  • 18 May 2020 8:58 AM GMT

    మచిలీపట్నం మడ అడవుల నరికివేతపై హైకోర్టులో పిటిషన్

    - వీడియో కాన్ఫిరెన్సు ద్వారా పిటిషన్ పై విచారించిన ధర్మాసనం.

    - మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధం అయిందని పిటిషన్ వేసిన ఇద్దరు మత్సకారులు

    - మడ అడవి కొట్టివేయడం చట్ట విరుద్ధమని ధర్మాసనానికి వివరించిన పిటిషనర్ తరుపు న్యాయవాది తిరుమాని విష్ణుతేజ

    - మడ అడవుల నరికివేతపై స్టేటస్ కో విధించిన ధర్మాసనం

    మడ అడవుల నరికివేతపై 4 వారాలలో కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం

  • 18 May 2020 7:25 AM GMT

    సింహాచలం దేవస్థానం వంటశాల వద్ద పాము కలకలం

    ♦ ఈ రోజు సింహాచలం దేవస్థానంలో వంటశాల వద్ద నాగజర్రి పాము కొంతసేపు కలకలం సృష్టంచింది.

    ♦ ఆలయ అర్చకులు సీతారామాచార్యులు ఆ సర్పాన్ని పట్టుకుని బంధించారు.

    ♦ సీతారామాచార్యులు గతంలో ఇలానే పాములు పట్టుకున్న సందర్భాలున్నాయి.

    ♦ ఎంత విష సర్పమైనా ఒడుపుగా ఆయన పట్టుకుంటారు..

    ♦ ఇలా పట్టుకున్న పాములను చంపకుండా సమీపంలోని అడవుల్లో వదులుతుంటారు.




  • 18 May 2020 7:23 AM GMT

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 2282

    ఏపీలో 2282 కు చేరిన కరోనా పాజిటీవ్ కేసులు

    గడిచిన 24 గంటల్లో 52 కొత్త కేసులు నమోదు



     



  • 18 May 2020 5:51 AM GMT

    విశాఖ గిరిజన ప్రాంతంలో బస్సులు నడపడానికి ప్రయత్నాలు

    దాదాపుగా ఏభై రోజులుగా  కరోనా లాక్ డౌన్ కారణంగా మిగిలిన ప్రపంచంతో విశాఖపట్నం మన్యం ప్రాంతానికి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. 

    - లాక్ డౌన్ నిబంధనలు సదలిస్తుండడంతొ ఏపీఎస్ ఆర్టీసీ ఇక్కడ బస్సులు తిప్పడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

    - ఈమేరకు పాడేరు డిపో నుండి ఏజెన్సీలో బస్సు సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతున్నారు.

    - ఇప్పటికే 29 బస్సు సర్వీసులు ఆర్టీసీ అధికారులు సిద్దం చేశారు.

    - బస్సులలో భౌతికదూరం పాటించేలా సీట్లలో ఏర్పాట్లు చేశారు. 



     


  • 18 May 2020 5:34 AM GMT

    తుపాను ప్రభావంతో ఎగసిపడుతున్న అలలు

    బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి.

    సోమవారం ఉదయం నుంచి ఉప్పాడ సముద్రతీరం అల్ల కల్లోలంగా మారింది.

    రంగంపేట నుంచి ఎస్పీ జిఎల్ శివారు వరకు సముద్ర అలలు పోటెత్తుతున్నాయి.సముద్రపు అలలు వాహనదారులపై విరుచుకుపడుతున్నాయి.

    దీంతో కాకినాడ ఉప్పాడ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు.

    నీటి మట్టం పెరగడం, వాతావరణంలో మార్పు రావడంతో సముద్రం అలలు మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు.

    సముద్రం పక్కన ఉన్న బోట్లు,వలలు భద్రపరచుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు.

Print Article
More On
Next Story
More Stories