ఈరోజు (మే-18-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.




Show Full Article

Live Updates

  • 18 May 2020 4:22 AM GMT

    జాడ దొరకని చిరుత..టెన్షన్ లో జనత!

    - నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో కాటేదాన్ వద్ద రహదారిపై కనిపించి కంగారు పెట్టి మాయం అయిపోయిన చిరుత పులి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

    - డ్రోన్లు, జాగిలాలు నాలుగు రోజులుగా చిరుత కోసం వెతుకుతూనే ఉన్నాయి. అధికారులు దాని జాడ కోసం ఆపసోపాలు పడుతూనే ఉన్నారు.

    - జంతువులను ఎరగా వేసి పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

    - చిరుత కోసం హిమాయత్‌సాగర్ జలాశయం చుట్టుపక్కల గ్రామాలైన అజీజ్‌నగర్, కొత్వాలగూడ, కవ్వగూడ, మర్లగూడ పరిసరాల్లో గాలించారు. అయినప్పటికీ దాని జాడ కనిపించలేదు.

    - దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుతను కచ్చితంగా పట్టుకు తీరతామనీ, దొరికేవరకూ ప్రయత్నాలు ఆపేది లేదనీ అధికారులు చెబుతున్నారు. 



     



  • 18 May 2020 3:24 AM GMT

    కోవిడ్ 19పై సీఎం జగన్ సమీక్ష ఈరోజు

    ◆కోవిడ్ 19 కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

    ◆సీఎస్, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

    ◆అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఏపీ పర్యావరణ అభివృద్ధి చట్టం-2020పై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమావేశంకానున్నారు.

  • 18 May 2020 3:21 AM GMT

    - ఈరోజు కృష్ణా రివర్‌ బోర్డు ముందు హాజరు కానున్న ఏపీ ఇరిగేషన్ అధికారులు

    - జీ ఓ నంబర్ 203 పై తమ వాదనలను వినిపించనున్న ఇరిగేషన్ శాఖ.

    - మధ్యాహ్నం 3 గంటలకు జీవో203 వాదనలు

  • 18 May 2020 3:20 AM GMT

    ఈరోజు నుంచి ఏపీలో గ్రామ సచివాలయాల వద్ద ఖరీఫ్ విత్తనాల పంపిణీ!

    - ఏపీ గ్రామ సచివాలయాల వద్ద రైతులకు ఈరోజు నుంచి ఖరీఫ్ విత్తనాలు పంపిణీ చేయనున్నారు.

    - ఇప్పటికే ఈమేరకు అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు.

    - ఆయా గ్రామ సచివాలయాల వద్ద విత్తనాల ధరల పట్టికను ఏర్పాటు చేశారు.

    - 8 లక్షల క్వింటాళ్ళకు పైగా విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.

    -18 రకాల వరి వంగడాల విత్తనాలపై క్వింటాల్ కు 500 రూపాయల సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం.



     


  • 18 May 2020 3:02 AM GMT

    విజయవాడలో సిపిఎం నేత సిహెచ్ బాబూరావు హౌస్ అరెస్ట్!

    - విద్యుత్ చార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో నోటీసులు అందజేసిన పోలీసులు.

    - ఆందోళనలో పాల్గొనడానికి వీల్లేదని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

    - పోలీసులు అణిచివేసినావ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోందని ప్రకటించిన సీపీఎం 

  • 18 May 2020 2:07 AM GMT

    పెను తుపానుగా మారిన ఎంఫాన్ : ఏపీలో ఓ మోస్తరు వర్షాలు

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ఎంఫాన్ మరింత బలపడి.. అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారిందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎంఫాన్ ఉంది. ఇది వాయువ్య దిశలో వెళ్తూ మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. సుమారుగా బుధవారం బెంగాల్‌లోని సాగర్ దీవులు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటొచ్చంటోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీలో ఓ మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

    కాగా, ఈ తుపాను కారణంగా ఆంధ్రాలోనూ తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. 

  • 18 May 2020 1:17 AM GMT

    లాక్‌డౌన్ 4.0 ఈరోజు నుంచే..

    నాలుగో విడత లాక్‌డౌన్‌ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కేంద్రం ఈ దశ లాక్‌డౌన్‌ లో పలు సడలింపులు ప్రకటించింది. అయితే, ఆయా రాష్ట్రాలు అక్కడి పరిస్థితులను బట్టి ఈ సడలింపులను అమలు చేస్తాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ఏపీ లో కేంద్ర గైడ్ లైన్స్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు, దీనిప్రకారం ఈరోజు నుంచి దాదాపుగా వాణిజ్య సంస్థలన్నీ పనిచేసే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులు కూడా ఈరోజు నుంచి రోడ్దేక్కనున్నాయి.

    ఇక తెలంగాణాలో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు పై తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక తెలంగాణాలో కూడా రేపట్నుంచి పరిమిత సంఖ్యలో బస్సులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.  

Print Article
More On
Next Story
More Stories