logo

జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు

జమ్మూ బస్టాండ్‌లో బాంబు పేలుడు

జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. జమ్ము బస్టాండ్‌లో భారీ పేలుడుకు కుట్రపన్నారు. బస్సులో సడెన్‌గా బాంబు పేల్చారు. ఈ పేలుడు ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు చేప్టటారు. ఈ ఘటనకు కారణమైన వారి కోసం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇది ఉగ్రవాదుల దుశ్చర్యా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. కాగా, బాంబు పేలుడు ఘటనలో 18 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. బస్సుపై గ్రనేడ్‌ దాడి జరిగిందని జమ్మూ ఐజీ నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

లైవ్ టీవి

Share it
Top