Top
logo

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం
Highlights

తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడి చేస్తుండగా ...

తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. ప్రయాణికులపై దాడి చేస్తుండగా అడ్డుకున్న టీసీపై బ్లేడ్ తో దాడి చేసింది. దీంతో టీసీ చేతికి గాయాలయ్యాయి. బ్లేడ్ బ్యాచ్ కు చెందిన ఇద్దరు సభ్యులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో టీసీ సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులను తమిళనాడుకు చెందిన వెంకటేశ్‌, విజయన్‌గా గుర్తించారు. వారిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story