తొలిదశకు ముందు తెగబడ్డ మావోలు..

తొలిదశకు ముందు తెగబడ్డ మావోలు..
x
Highlights

తొలిదశ ఎన్నికలకు రెండు రోజుల ముందు చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందే రక్తచరిత్ర లిఖించారు. దంతేవాడ జిల్లాలో...

తొలిదశ ఎన్నికలకు రెండు రోజుల ముందు చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఎన్నికలకు కొన్ని గంటల ముందే రక్తచరిత్ర లిఖించారు. దంతేవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌ను టార్గెట్‌గా చేసుకుని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే భీమా మాండవి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాండవితో పాటు మరో ఐదుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బస్తర్‌ అభ్యర్థి బైదురాం కశ్యప్‌ తరపున ప్రచారం చేసిన దంతేవాడ ఎమ్మెల్యే బీమా మాండవి తిరిగొస్తున్న క్రమంలో మావోలు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాండవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మందుపాతర పేల్చడంతో పాటు మావోయిస్టులు కాల్పులకు తెగబడటంతో ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. అయితే మావోలకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడు ధాటికి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలైంది. ఇటు సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్నికలు బహిష్కరించాలని గతంలోనే పిలుపునిచ్చిన మావోలు ఎన్నికల సిబ్బందిని కూడా హెచ్చరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనద్దని పోలీసులకు కూడా వార్నింగ్‌ ఇచ్చారు. ఇటీవలే దంతేవాడ ఎస్పీపై కూడా దాడికి ప్రయత్నించారు. తృటిలో ఆయన తప్పించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories