75 ఏళ్ల భారతావనికి సూచికగా 75 హామీలు

75 ఏళ్ల భారతావనికి సూచికగా 75 హామీలు
x
Highlights

75 ఏళ్ల భారతావనికి సూచికగా 75 హామీలు ఇది బీజేపీ మేనిఫెస్టో రూపం. మొత్తం 75 హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. సంకల్ప్ పత్ర్‌ పేరుతో 45 పేజీలతో...

75 ఏళ్ల భారతావనికి సూచికగా 75 హామీలు ఇది బీజేపీ మేనిఫెస్టో రూపం. మొత్తం 75 హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. సంకల్ప్ పత్ర్‌ పేరుతో 45 పేజీలతో రూపొందిన మేనిఫెస్టోను ప్రధాని మోడీ ఢిల్లీలో విడుదల చేశారు. అన్నిటికంటే దేశం ముఖ్యం అనే సూత్రానికి బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే జాతీయ భద్రత, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని సరిహద్తుల్లో ఉగ్రవాద చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే జమ్ము కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ఇక కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు ప్రసాదించే 35ఏ అధికరణాన్నా కూడా రద్దు చేస్తామని మేనిఫెస్టోలో బీజేపీ తేల్చి చెప్పింది.

వివాదాస్సద రామమందిర వివాదానికి రాజ్యాంగ పరిధిలో పరిష్కారం కనుగొంటామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న భిన్న వాదనలకు కూడా చట్టపరిధిలో పరిష్కారం ఇస్తామని చెప్పింది. ఇక బీజేపీ మేనిఫెస్టోలో వ్యవపాయ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. వ్యవసాయ రంగానికి 25 లక్షల కోట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 2022 సంవత్సరం నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామని , రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇక చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ స్కీం అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. అలాగే చిరు వ్యాపారులకు కూడా పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

జీఎస్టీ అమలును మరింత సరళతరం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అలాగే పెదల వైద్య సాయం అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తృతం చేస్తామని ప్రకటించారు. అంతేకాదు బినామీ ఆస్తుల జప్తుకు చర్యలు తీపుకుంటామని స్పష్టం చేశారు. ఇక అందరికీ చదువు అందిచేలా చర్యలు తీసుకోవడంతో పాటు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్య సీట్లను పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక ఎన్నో ఏళ్లుగా మూలన పడిన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకు వస్తామని చట్టసభల్లో ఆడవారికి 33 శాతం రిజర్వేషన్ కల్సిస్తామని ప్రకటించారు. అలాగే మోడీ నేతృత్వంలో సుపరిపాలన సాగుతుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories