Top
logo

బీజేపీ నాలుగో జాబితా విడుదల...చేవెళ్ల బరిలో...

బీజేపీ నాలుగో జాబితా విడుదల...చేవెళ్ల బరిలో...
Highlights

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ తాజాగా నాలుగో జాబితాను విడుదల...

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ తాజాగా నాలుగో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో పోటీ చేసే 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణలోని 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ మరో ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలియచేసింది. మెదక్‌ లోక్‌సభ స్థానంలో మాత్రం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఊహించినట్టుగానే చేవెళ్ల నియోజకవర్గం నుంచి బి.జనార్ధన్‌రెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది.

బీజేపీ నాలుగో జాబితా అభ్యర్థులు

తెలంగాణ

అదిలాబాద్‌ - సోయం బాబు రావు

పెద్దపల్లి - ఎస్‌ కుమార్‌

జహీరాబాద్‌ - బానాల లక్ష్మారెడ్డి

హైదరాబాద్‌ - భగవంత్‌ రావు

చేవెళ్ల - జనార్ధన్‌ రెడ్డి

ఖమ్మం - వాసుదేవ రావు

కేరళ

పథనంతిట్ట - సురేంద్రన్‌

ఉత్తరప్రదేశ్‌

నగీనా - యశ్వంత్‌

కైరానా - ప్రదీప్‌ చౌదరీ

బులంద్‌షహర్‌ - భోలా సింగ్‌

పశ్చిమబెంగాల్‌

జాంగిపూర్‌ - మఫుజా ఖతూన్‌

Next Story


లైవ్ టీవి