మోడీ ప్రచారం శృతి మించుతోందా...మసూద్ అజార్ అంశాన్ని....

మోడీ ప్రచారం శృతి మించుతోందా...మసూద్ అజార్ అంశాన్ని....
x
Highlights

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. తాజాగా మసూద్ అజార్ ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడం...

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. తాజాగా మసూద్ అజార్ ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడం మోడీ కృషేనంటూ ప్రచారం మొదలు పెట్టేసింది. అంతేకాదు తనను చంపేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటున్నారు మోడీ.

దశల వారీగా ఎన్నికలు జరుగుతున్న కొద్దీ బీజేపీ తన ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టే రీతిలో ప్రసంగించడంలో ప్రధాని మోడీ కూడా వెనక్కు తగ్గడం లేదు. రాజకీయపరమైన ప్రతీ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది బీజేపీ. తాజాగా మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రకటన చేయడంతో బీజేపీ అది తమ గొప్పతనంగా చెప్పుకుంటోంది. ఇది బీజేపీ సాధించిన విజయంగా ఆ పార్టీ ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. మసూద్ అజార్ విషయంలో భారత్ గట్టిగా ఒత్తిడి పెట్టిందని, ప్రపంచ దేశాలను కూడగట్టడంలో ప్రధాని మోడీ విజయం సాధించారని, ప్రత్యేకించి చైనా మెడలు వంచారనీ బీజేపీ ప్రచారం మొదలు పెట్టేసింది. ఇక యూపీలోని కౌశాంబి ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని తమ పాలన ప్రజలకు మంచి చేస్తోందని చెప్పుకున్నారు. కుంభమేళాను తొలిసారి అత్యంత సంప్రదాయబద్ధంగా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా జరుపుకున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో దేశ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ బాంబు పేలుళ్ళు జరిగేవని కానీ తమ హయాంలో ఒక్కటంటే ఒక్కటి ఎక్కడైనా జరిగిందా అని ప్రజలను నిలదీశారు దీనికి కారణమేంటని ప్రజలను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అందరూ మోడీ మోడీ అని అరవడంతో ప్రధాని స్పందించారు. అదంతా మీరేసిన ఓటు మహిమ అని తేల్చి చెప్పారు. ప్రజలు సమర్దవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఈసారి కూడా బీజేపీకి అఖండ మెజారిటీ ఇవ్వాలనీ కోరారు. కాంగ్రెస్ తనను భౌతికంగా అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు. నాలుగు దశల పోలింగ్ లో బీజేపీకి పెద్దగా ఓట్లు రాలలేదన్న విశ్లేషణలు విన్నాక ప్రధాని తన హోదాను మరచి దిగజారి మాట్లాడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories