Metro Project: విజయవాడ, విశాఖ ప్రజలకు శుభవార్త

Metro Project: విజయవాడ, విశాఖ ప్రజలకు శుభవార్త
x

Metro Project: విజయవాడ, విశాఖ ప్రజలకు శుభవార్త

Highlights

విజయవాడ, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుల‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ డెక్కర్ మార్గాలతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం! ప్రాజెక్టు వివరాలు, నిధులు, ప్రగతి గురించి పూర్తిగా తెలుసుకోండి.

Metro Project: విజయవాడ, విశాఖపట్నం నగరాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్తను అందించింది. ట్రాఫిక్ భారం తగ్గించే దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ రెండు నగరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) తయారీ బాధ్యతలను సికింద్రాబాద్‌కు చెందిన బార్సిల్ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ప్రక్రియలో అత్యంత తక్కువ ధరను కోట్ చేసిన కారణంగా రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ సంస్థను సిఫారసు చేసింది.

డబుల్ డెక్కర్ మెట్రో ప్రత్యేకత

ఈ ప్రాజెక్టులో విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ మెట్రో మార్గాలు ప్రతిపాదించబడ్డాయి.

విశాఖపట్నంలో మధురవాడ - తాటిచెట్లపాలెం, గాజువాక - స్టీల్ ప్లాంట్ మధ్య మొత్తం 19 కి.మీ. డబుల్ డెక్కర్ మార్గం నిర్మించనున్నారు.

విజయవాడలో రామవరప్పాడు రింగ్ - నిడమానూరు మధ్య 4.70 కి.మీ. మేరకు మార్గాన్ని ప్రతిపాదించారు.

ప్రాజెక్టు వివరాలు & వ్యయం

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ మెట్రో ప్రాజెక్టుల DPRలను ఆమోదించింది.

విశాఖలో తొలి దశలో 46.23 కి.మీ పొడవున 3 కారిడార్లు – వ్యయం: రూ.11,498 కోట్లు

రెండో దశలో 30.67 కి.మీ పొడవున మరో కారిడార్ – వ్యయం: రూ.5,734 కోట్లు

విజయవాడలో గన్నవరం - పండిట్ నెహ్రూ బస్టాండ్, అమరావతి వరకు కారిడార్లు ప్రతిపాదనలో ఉన్నాయి. మూడవ కారిడార్ దాదాపు 27.75 కి.మీ మేర ఉండనుంది.

కేంద్రం నుంచి నిధుల మంజూరు

ఈ మెట్రో ప్రాజెక్టులకు DPR తయారీకి కేంద్రం నుండి నిధులు మంజూరయ్యాయి. సమగ్ర మొబిలిటీ ప్లాన్ (CMP) కింద

విశాఖకు రూ.84.47 లక్షలు

విజయవాడకు రూ.81.68 లక్షలు విడుదలయ్యాయి.

భవిష్యత్తులో మారిన నగరాల ముఖచిత్రం

రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, డిజైన్, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయించింది. విశాఖలో మెట్రో నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి, ప్రజలకు అధునాతన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ఇది కదా ప్రజలు ఎదురు చూసింది!

Show Full Article
Print Article
Next Story
More Stories