చంద్రబాబు కంటే భువనేశ్వరి ఆస్తులే ఎక్కువ!

చంద్రబాబు కంటే భువనేశ్వరి ఆస్తులే ఎక్కువ!
x
Highlights

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. కుప్పంలో నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌...

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. కుప్పంలో నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం చూస్తే ఆయన ఆస్తుల విలువ సుమారు 700 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఆయన అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు రూ.5కోట్లకు పైగా అప్పులున్నాయి. బాబు ఆస్తులకన్నా ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు చాలా ఎక్కువ.

ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. నామినేషన్ సందర్భంగా తన ఆస్తి విలువ సుమారు 700 కోట్లని చంద్రబాబు అఫిడవిట్‌లో వెల్లడించారు. మొత్తం ఆస్తుల్లో తన స్థిరాస్తుల విలువ 19కోట్ల 96 లక్షలు కాగా చరాస్తుల విలువ 47 లక్షల 38వేలుగా చూపించారు చంద్రబాబు.

ఇక తన సతీమణి నారా భువనేశ్వరి చరాస్తుల విలువ 574 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు భువనేశ్వరి స్థిరాస్తుల విలువ 95 కోట్లుగా అఫిడవిట్‌లో పొందపరిచారు. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు తన ఆస్తి విలువను 176 కోట్లుగా ఆయన చూపించారు. తాజాగా అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువను 700కోట్లుగా ప్రకటించారు.

చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు ఉండగా అప్పులు రూ.5కోట్లకు పైగా ఉన్నాయి. చంద్రబాబు ఆస్తులకన్నా ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు చాలా ఎక్కువ. భువనేశ్వరి మొత్తం ఆస్తుల విలువ 648.13కోట్లు ఉండగా అప్పులు మాత్రం 10 కోట్లున్నట్టు అఫిడవిట్‌లో పొందుపరిచారు చంద్రబాబు.

చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తులు

* మొత్తం ఆస్తులు: రూ.20,44,33,814

* చరాస్తులు: రూ.47,38,067

* స్థిరాస్తులు: రూ.19,96,95,474

* అప్పులు: రూ.5,24,96,605

* 2017-18లో ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆదాయం: రూ.64,73,208

* మోటారువాహనం: అంబాసిడర్‌ కారు (ఏపీ09జీ 0393). దీని విలువ రూ.2,22,500

భువనేశ్వరి పేరుతో ఉన్న ఆస్తులు

* మొత్తం ఆస్తి: రూ.648,13,17,434

* స్థిరాస్తి మొత్తం: 74,29,00,000

* చరాస్తులు: రూ.573,84,17,434

* 2017-18లో భువనేశ్వరి పేరుతో చూపించిన ఆదాయం: రూ.13,45,30,513

* సొంతంగా సంపాదించిన ఆస్తి విలువ: రూ.74,29,00,000

Show Full Article
Print Article
Next Story
More Stories