Top
logo

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు...కిలోల కొద్దీ వెండి, బంగారు...

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు...కిలోల కొద్దీ వెండి, బంగారు...
Highlights

విజయవాడలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని...

విజయవాడలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భుక్యా నాయక్‌ ముఠా సుమారు వంద ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 54 లక్షలు విలువ చేసే 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి ఆభరణాలు, 9 లక్షల 65వేల నగదుతో పాటు ఒక ల్యాప్‌ ట్యాప్‌, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భుక్యా నాయక్‌ ముఠాపై మొత్తం 200 కేసులు ఉన్నాయని, ముఠాలోని ఇద్దరు సభ్యులు సురేష్‌, పవన్‌ కుమార్‌ ఇప్పటికే జైళ్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

లైవ్ టీవి


Share it
Top