ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టుల బంద్‌ ..

ఆపరేషన్ సమాధాన్‌కు వ్యతిరేకంగా మావోయిస్టుల బంద్‌ ..
x
Highlights

'ఆపరేషన్‌ సమాధాన్‌'కు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో సరిహద్దు ఏజెన్సీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ బంద్‌కు మద్దతు...

'ఆపరేషన్‌ సమాధాన్‌'కు వ్యతిరేకంగా నేడు భారత్‌ బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో సరిహద్దు ఏజెన్సీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ నుంచి మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సరిహద్దుల్లో, ఏవోబీలో మావోయిస్టులు పలుచోట్ల సభలు, ప్రదర్శనలు నిర్వహించారు.

'ఆపరేషన్‌ సమాధాన్‌'కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ బంద్‌ పిలుపునివ్వడంతో ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేశారు. మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో 'ఆపరేషన్‌ సమాధాన్‌'ను కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దీనిని మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా, జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు 'సమాధాన్‌' వ్యతిరేక సభలు సమావేశాలకు, 31న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలతోపాటు ఆంధ్ర–ఒడిశా, ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో వాల్‌ పోస్టర్లు, బ్యానర్లు పడ్డాయి. మందుపాతర్లు పేల్చడం, బస్సులు లారీలకు నిప్పటించడం వంటి విధ్వంసకర చర్యలకు మావోయిస్టులు తెగించారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు మండం సరివెల సమీపంలోని ప్రధాన రహదారిపై ఈ నెల 29వ తేదీ రాత్రి మందుపాతరను పేల్చారు. ఆర్టీసీ తాండూరు డిపో బస్సులకు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీకి నిప్పంటించారు. వీటన్నింటి నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా రద్దు చేసింది.

బంద్‌ నేపథ్యంలో ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటైంది. అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఏజెన్సీ ప్రజలు నలిగిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మావోయిస్టుల బంద్‌ నేపథ్యంలో అదనపు బలగాలు సరిహద్దుల్లో కూంబింగ్‌ చేపట్టాయి. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. 'ఆపరేషన్‌ సమాధాన్‌'కు వ్యతికరేకంగా మావోయిస్టులు పోరును ఉధృతం చేసే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం మరింత పకడ్బందీగా వ్యవహరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories