రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు: బాల్క సుమన్

రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు: బాల్క సుమన్
x
Highlights

ఇంటర్‌ ఫలితాల వివాదంలో ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. సున్నితమైన అంశంపై విద్యార్థుల్లో ఆందోళన...

ఇంటర్‌ ఫలితాల వివాదంలో ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. సున్నితమైన అంశంపై విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయంటూ మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల్లో కొంత టెక్నికల్ సమస్య వచ్చింది నిజమే అని దాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బాల్క సుమన్ అన్నారు. ఈ విషయంలో కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్టు అని సుమన్ మండిపడ్డారు. ఈ టెండర్ గ్లోబరీనాకు కట్టబెట్టింది కేటీఆర్ అని రేవంత్ ఆరోపించడాన్ని బాల్క సుమన్ తప్పుబట్టారు. అప్పట్లో ఇది విద్యాశాఖ పరిధిలోని అంశమని అన్నారు. 24 గంటల్లో కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై రేవంత్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాల్క సుమన్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories