బాలాపూర్ బంగారం

బాలాపూర్ బంగారం
x
Highlights

గణపతి ఉత్సవాల్లో లడ్డూ వేలం ఒక ప్రత్యేకత. అదీ హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి. వందల్లో ప్రారంభమై పాతికేళ్లలో లక్షలాది రూపాయలు పలికే బాలాపూర్ లడ్డూ వేలం ఇప్పటివరకూ ఎవరికి దక్కిందనే విశేషాలు మీకోసం..

హైదరాబాద్ గణేష్ వేడుకల్లోబాలాపూర్‌ లడ్డూకు ప్రత్యేక స్ధానం ఉంది. భక్తుల కొంగు బంగారంగా బాలాపూర్‌ గణేష్ లడ్డూ ప్రసిద్ధి పొందింది. 1994 నుంచి ప్రతి ఏటా బాలాపూర్ లడ్డూ వేలం జరుగుతోంది.

వందల నుంచి లక్షల్లోకి..

1994 నుంచి ప్రారంభమైన లడ్డూ వేలం ఎటికేడూ ప్రఖ్యాతి పొందుతోంది. ఈ 25 ఏళ్లలో రూ 450 నుంచి 16.60 లక్షలకు లడ్డూ ధర చేరింది.

- తొలిసారి రూ. 450లకు కొనుగోలు చేసిన కొలను ఫ్యామిలి

- 1995లో రూ. 4,500లకు కొనుగోలు

- 1996లో రూ. 18 వేలకు, 97లో రూ.28 వేలు పలికిన ధర

- 1998లో రూ 51వేలకు కొనుగోలు చేసిన కొలను ఫ్యామిలి

ఇలా వరుసగా ఐదు సార్లు లడ్డూ దక్కించుకున్న కొలను మోహన్ రెడ్డి

- 1999లో రూ.65 వేలకు దక్కించుకున్న కళ్లెం ప్రతాపరెడ్డి

- 2000లో రూ 66 వేలు, 2001లో రూ 85 వేలు పలికిన బాలాపూర్ ప్రసాదం

- 2002లో రూ1.5 లక్షలు, 2003లో రూ 1.55 లక్షలకు కొనుగోలు

- 2004లో రూ 2.1 లక్షలు, 2005లో రూ 2.08 లక్షలకు కొనుగోలు

- 2006లో రూ3 లక్షలు, 2007లో రూ 4.15 లక్షలు పలికిన ధర

- 2008లో రూ5.07 లక్షలు, 2009లో రూ 5.10 లక్షలకు కొనుగోలు

- 2010లో రూ5.30 లక్షలు, 2011లో రూ 5.45 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ

- 2012లో రూ7.50 లక్షలు, 2013లో రూ 9.26 లక్షలు పలికిన ధర

- 2014లో పది లక్షలకు బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న జైహింద్ రెడ్డి

- 2015లో రూ 10.32 లక్షలకు లడ్డూ కొనుగోలు

- 2016లో రూ 14.65 లక్షలకు కొనుగోలు చేసిన స్కైలాబ్ రెడ్డి

- 2017 రూ 15.6 లక్షలకు లడ్డూను దక్కించుకున్న నాగం తిరుపతిరెడ్డి

- 2018లో రూ. 16.6 లక్షలు దక్కించుకున్న శ్రీనివాస్‌ గుప్తా

- తొలిసారి బాలాపూర్ లడ్డూను తయారుచేసిన గుల్‌జల్ ఆగ్రా స్వీట్స్

- 21 కిలోల బరువుతో తయారవుతున్న బాలపూర్ లడ్డూ

గత నాలుగేళ్లుగా తాపేశ్వరంలోని హానీ ఫుడ్స్‌లో లడ్డూ తయారీ జరుగుతోంది. వేలం పాటలో విజయం సాధించిన భక్తుడికి లడ్డూతో పాటు .. రెండు కిలోల వెండి గిన్నెను నిర్వాహకులు అందజేయనున్నారు. 25 ఏళ్లలో కొలను ఫ్యామిలీ అత్యధికంగా ఎనిమిది సార్లు లడ్డూ దక్కించుకాగా ఈసారి కూడా లడ్డూ దక్కించుకునేందుకు పలువురు భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా రికార్డ్ ధర పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వినాయకునికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోలాహలం మిన్నంటింది. ఆ కోలాహలం ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం లైవ్ బ్లాగ్ ద్వారా. లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories