ఓటర్లకు స్పెషల్‌ దోశ...

ఓటర్లకు స్పెషల్‌ దోశ...
x
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకొంది. నామినేషన్ల పర్వం పూర్తికావడంతో ప్రధాన అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు తమ నియోజకవర్గాలలో ప్రచారం జోరు...

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకొంది. నామినేషన్ల పర్వం పూర్తికావడంతో ప్రధాన అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు తమ నియోజకవర్గాలలో ప్రచారం జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా బాలయ్య భార్య వసుంధర, నారాయణ భార్య రమాదేవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇటు వసుంధర అటు సింధూర ఓటర్ల పై దోశల అస్త్రాన్ని ప్రయోగించారు. హిందూపురంలో వసుంధర కారం దోశెలు వేస్తే నెల్లూరులో సింధూర ప్లేయిన్ దోశె వేసి సందడి సందడి చేశారు.

దేశంలో, రాష్ట్రంలో ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలంటే సందడే సందడి. సీట్లు సంపాదించడం నామినేషన్ల వేయటం నుంచి నియోజక వర్గాలలో ప్రచారం వరకూ ఎన్నో వింతలు, విశేషాలు. ఓటర్లను ఆకట్టుకోడానికి తమకు తెలిసిన రకరకాల విద్యలు ప్రయోగిస్తున్నారు. హిందూపురం సిటింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర. తన భర్త తరపున హిందూపురం వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు. హిందూపురం వార్డులోని రోడ్డు పనులను పరిశీలించిన వసుంధర పారతో మట్టిని ఎత్తి పోయటమే కాదు కారం దోశె వేసి మరీ జై బాలయ్య అనిపించుకొన్నారు. మొత్తం మీద సుడిగాలి ప్రచారంతో వార్డులన్నీ చుట్టి బాలయ్యను మరోసారి గెలిపించాలంటూ అభ్యర్థించారు.

ఇక నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో టీడీపీ మంత్రి నారాయణ కుటుంబసభ్యులంతా ప్రచారం జోరు పెంచారు. అంతేకాదు నారాయణ చిన్నకుమార్తె సింధూర మరో అడుగు ముందుకు వేసి ఓ ఓటరు ఇంట్లో ప్లెయిన్ దోశ వేసి వావ్ అనిపించుకొంది. ఇస్త్రీ చేయటమే కాదు దర్జీపని సైతం చేసి సింధూర ఓటర్లకు చేరువకావటానికి తనవంతు ప్రయత్నం చేసింది. బాలయ్య భార్య వసుంధర, నారాయణ కుమార్తె సింధూర దోశల మంత్రానికి మరి ఎన్ని ఓట్లు రాలతాయో మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories