Top
logo

బీసీలు చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు

బీసీలు చుట్టూ తిరుగుతోన్న ఏపీ రాజకీయాలు
X
Highlights

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బీసీలపై ప్రేమ...

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా బీసీలపై ప్రేమ కురిపిస్తున్నాయి. అధికార టీడీపీ ఇప్పటికే జయహో బీసీ పేరుతో సభ నిర్వహించి వరాలు జల్లు కురిపించడంతో, ప్రతిపక్ష వైసీపీ కూడా బీసీలపై ఫోకస్‌ పెట్టింది. బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామంటూ డిక్లరేషన్ ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి. పార్టీల తలరాతలను మార్చే బీసీలను తలకెక్కించుకుంటున్నాయి. బలహీనవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలోకి వేసుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. టీడీపీ అంటే బీసీలు బీసీలంటే తెలుగుదేశం అన్నారు చంద్రబాబు. జయహో బీసీ అంటూ వరాల జల్లు కురిపించిన సీఎం బలహీన వర్గాలను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు.

బీసీలే టీడీపీ బలమని బాబు చెబుతుంటే ఆ బలాన్ని తమ వైపు తిప్పుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ బీసీ నేతలతో సమావేశమైన జగన్మోహన్‌రెడ్డి‌ ఫిబ్రవరి 19న భారీఎత్తున సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

అటు టీడీపీ ఇటు వైసీపీ బీసీలను తమవైపు తిప్పుకునేందుకు అన్నిరకాల ప్రయ్నత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు ఇప్పటికే బీసీలపై వరాల జల్లు కురిపించగా, ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌తో బలహీనవర్గాలను తనవైపు ఆకర్షించేందుకు పావులు కుదుపుతున్నారు. మరి బీసీలు ఎవరి వైపు మొగ్గుచూపుతారో ఎవరికి హ్యాండిస్తారో మరో మూడు నెలల్లో తేలిపోనుంది.


Next Story