కరవు నేలపై కియా కారు పరుగులు

కరవు నేలపై కియా కారు పరుగులు
x
Highlights

ప్రపంచ కార్ల తయారీ దిగ్గజాల్లో ఒక్కటైన కియా కార్ల ఉత్పత్తి అనంతపురంలో ప్రారంభం కానుంది. నేడు ట్రైల్ రన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కియాలో...

ప్రపంచ కార్ల తయారీ దిగ్గజాల్లో ఒక్కటైన కియా కార్ల ఉత్పత్తి అనంతపురంలో ప్రారంభం కానుంది. నేడు ట్రైల్ రన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కియాలో తయారైన కారులో ఆయన విహరించనున్నారు. మార్చి నుంచి పూర్తీ స్థాయిలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది. కరవు నేలలో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కియా సకాలంలో పూర్తీ కావడం అనుబంధ పరిశ్రమల నిర్మాణం శరవేగంగా సాగుతుండడంతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారుతున్నాయి.

గత ఏడాది ఫిబ్రవరి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కియా పరిశ్రమ అధ్యక్షుడు హాన్ వూ పార్క్ తో కలిసి అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ఎర్రమంచి వద్ద ప్రేం ఇన్స్ లేషన్ వర్క్ ను ప్రారంభించారు. ఏటా మూడు లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పరిశ్రమ ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 2019 లో కార్ల తయారీ లక్ష్యంగా పరిశ్రమ నెలకొల్పామని ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయని అప్పట్లో సీఎం తో పాటు కియా అధ్యక్షుడు పార్క్ తెలిపారు. తొలుత మూడువేల మందికి ఉపాధి లభించే విధంగా పనులు చేపట్టామని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని సీఎం తెలిపారు. భవిష్యత్తులో అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా మారుస్తామని తెలిపారు. చెప్పినట్లు గానే ఏడాదిలోగా కియాలో మొదటి కారు బయటికి వస్తోంది.

కొరియాలో అతి ప్రాచీనమైన కార్ల కంపెనీ కియా ఏటా 2.7 మిలియన్ కియా వాహనాలను ఐదు దేశాల్లోని 14 తయారీ ప్లాంట్లు, అసెంబ్లీ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తూ 18 దేశాల్లో విక్రయిస్తోంది. అలాంటి కంపెనీ అనంతపురం నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఎర్రమంచి వద్ద 650 ఎకరాల్లో దక్షిణ కొరియా కు చెందిన కియా కార్ల పరిశ్రమ ఏర్పాటైంది. కియా పరిశ్రమ ద్వారా జిల్లాకు రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ప్రత్యక్షంగా ఏడు వేల ఉద్యోగాలు, పరోక్షంగా 4 వేల ఉద్యోగాలు దక్కనున్నాయి. ఏటా 3 లక్షల కార్ల ను తయారు చేసి మార్కెట్ కు పంపనున్నారు.

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రైల్ రన్ ప్రొడక్షన్ లో భాగంగా తయారైన కారులో రోడ్డుపై ప్రయాణించనున్నారు. కార్ల తయారీ కంపెనీ నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుందని కరవుజిల్లాకు ఇదివరం అని అధికారులు చెబుతున్నారు.

కరవుకు మారుపేరైన అనంతపురం జిల్లాలో మల్టీ నేషనల్ కంపెనీ కియా వంటి దిగ్గజ సంస్థలు ఏర్పాటు కావడం తో ఇక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లక్షల్లో ఉన్న భూముల విలువ కోట్లకు పెరిగింది. ఇతర పరిశ్రమలు తరలి వస్తూండడంతో జిల్లాలో కొంత వరకూ కరవును జయించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories