వివేకా హత్యకు హంతకుల ముందు జాగ్రత్త...ముందుగా కుక్కను కొట్టి చంపిన...

వివేకా హత్యకు హంతకుల ముందు జాగ్రత్త...ముందుగా కుక్కను కొట్టి చంపిన...
x
Highlights

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు...

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఈ శునకాన్ని మర్డర్ ప్లాన్‌లో భాగంగానే హత్య చేసినట్టు తెలుస్తోంది.

వైఎస్ వివేకా ఇంటి వద్ద కుక్క ఉంటే ఆ ప్రాంతంలోకి వెళ్లడం కష్టమనే ఉద్దేశంతో ముందుగానే దానిని నిందితులు చంపేశారు. హత్యకు ముందు నిర్వహించిన రెక్కీలో కుక్కను గమనించిన దుండగులు దాని అడ్డు ముందే తొలగించుకుని హత్యకు పథకం పన్నినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోస్టుమార్టం నివేదిక రావడానికి ముందు వరకు వివేకా గుండెపోటుతో మరణించారన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయనది హత్యేనని, గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారని తేలింది. వివేకా ఇంటి పరిసరాల్లో తచ్చాడే కుక్క కూడా హత్య కావడం కలకలం రేగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories