ఏప్రిల్ 10... రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్

ఏప్రిల్ 10...  రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్
x
Highlights

ఏప్రిల్ 10 రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ ఆ తేదీన ఏపీ వైపు వెళ్లే రైళ్లలో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. సంక్రాంతి రద్దీ చూశాం ఇప్పుడు ఎన్నికల సంక్రాంతిని...

ఏప్రిల్ 10 రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ ఆ తేదీన ఏపీ వైపు వెళ్లే రైళ్లలో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. సంక్రాంతి రద్దీ చూశాం ఇప్పుడు ఎన్నికల సంక్రాంతిని చూడబోతున్నాం. అభ్యర్థులు టికెట్ల కోసం పోటీ పడుతుంటే ఓటర్లు రైళ్ల టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలంగాణ, ఏపీలో వివిధ నగరాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్న వారికి సొంత గ్రామాల్లో ఓటు హక్కు ఉంది. దీంతో ఏప్రిల్ 10న సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బల్దేరే రైళ్లల్లో సీట్లన్నీ అయిపోయాయి.

ఏప్రిల్ 10న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే విశాఖపట్నం గరీభ్ రథ్ థర్డ్ ఏసీ సీట్లు ఖాళీగా లేవు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ టికెట్లు రిగ్రెట్‌కు చేరాయి. వెయింటింగ్ లిస్టులోనే టికెట్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఎల‌్‌టీటీ విశాఖ ఎక్స్‌ప్రెస్ , విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో కూడా 10వ తేదీన రిజర్వేషన్లు రిగ్రెట్‌కు చేరాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ టికెట్ల వెయింటింగ్ లిస్టు 198కి చేరాయి. శబరి ఎక్స్‌ప్రెస్‌, నారాయణాద్రి, వెంకటాద్రి, చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనూ 10వ తేదీన ఖాళీలు లేవు. ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపాలని ఉన్న రైళ్లకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. పోలింగ్‌కు వెళుతున్నందున అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యేక రైళ్లు నడుపాలని ముందస్తు రిజర్వేషన్‌ నిమిత్తం లేని జన సాధారణ్ రైళ్లను వేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories