సంక్రాంతి బరిలో ఈసారి ఏం జరగబోతోంది...కత్తులతో కోళ్లు యుద్దం చేస్తాయా..?

Cockfight
x
Cockfight
Highlights

సంక్రాంతి సంబరాల మాటున కోడి పందాల నిర్వహణకు రంగం సిద్ధమైంది, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కోళ్ళు పందాలకు సై అంటున్నాయి. భోగి మొదలుకుని కనుమ వరకు భారీఎత్తున పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్ళు సమాయత్తమయ్యారు. పోలీసు ఆంక్షల మధ్యే కోళ్లను బరిలోకి దింపేందుకు రెడి అయ్యారు.

సంక్రాంతి సంబరాల మాటున కోడి పందాల నిర్వహణకు రంగం సిద్ధమైంది, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు కోళ్ళు పందాలకు సై అంటున్నాయి. భోగి మొదలుకుని కనుమ వరకు భారీఎత్తున పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్ళు సమాయత్తమయ్యారు. పోలీసు ఆంక్షల మధ్యే కోళ్లను బరిలోకి దింపేందుకు రెడి అయ్యారు.

తెలుగు సంసృతిని చాటే మూడురోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి. పంట చేతికందే సమయంలో వచ్చే తెలుగు వెలుగుల వేడుక. రైతుల కళ్లలో ఆనందం ముంగిళ్లలో గొబ్బెమ్మల అందాలు హరిదాసుల సంకీర్తనలు ఇలా సంక్రాంతి వెలుగులు పల్లె సొగసులకు మరింత అందాన్ని, కొత్త శోభను తెస్తాయి. కానీ వీటన్నింటికంటే కూడా అందరి దృష్టినీ ఆకర్షించేవి మాత్రం కోడి పందాలే.

దశాబ్దాల క్రితం సరదాగా మొదలైన కోడిపుంజుల పోటీ సంక్రాంతికి ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పుడు కోడిపందాలు లేకుండా సంక్రాంతి లేదన్నది వాస్తవం. అయితే కోర్టుల ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు ఉన్నా, బరులు గీచి కోళ్ళకు కత్తులు కట్టి పందెం వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

కోడిపందేలు అనగానే మనకు గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు. కోనసీమలోని ఐ.పోలవరం, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, సఖినేటిపల్లి, అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ఇలా పలు మండలాల్లో కోడి పందేల బరులు వెలుస్తాయి. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో కూడా పందేలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, కొప్పాక, జంగారెడ్డిగూడెం, ధర్మాజీగూడెం, భీమడోలు, గుండుగొలను ప్రాంతాల్లో పోటీలు జరుగుతుంటాయి. గతంలో ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన ఈ పందేలు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు విస్తరించాయి. అటు హైదరాబాద్‌ శివార్లలోనూ జోరుగా పోటీలు జరుగుతున్నాయి.

కేవలం వినోదం కోసం ప్రారంభమైన కోడిపందేలు రానురాను లక్షలు, కోట్ల రూపాయల బెట్టింగ్‌కు వేదికగా మారాయి. ప్రటి ఏటా కోడిపందేలలో వందల కోట్లు చేతులు మారతాయి. ప్రస్తుతం కోర్టుల ఆంక్షలు, పోలీసులు, అధికారుల పహారా, అధికార పార్టీ నాయకుల హంగామాతో పందాల బరులు వేడెక్కాయి. బరిలో కొట్టుకునేందుకు కోళ్లు, డబ్బులు కుమ్మరించేందుకు పందెంరాయుళ్లు, వారిని అడ్డుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories