పవన్ వ్యాఖ్యలకు అలీ కౌంటర్..

పవన్ వ్యాఖ్యలకు అలీ కౌంటర్..
x
Highlights

జనసేన అధినేత వపన్ కళ్యాణ్, సినీ నటుడు అలీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆలీ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ పవన్ ఆరోపిస్తూ .. ఎప్పుడు ఎక్కడో ఎలా...

జనసేన అధినేత వపన్ కళ్యాణ్, సినీ నటుడు అలీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆలీ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడంటూ పవన్ ఆరోపిస్తూ .. ఎప్పుడు ఎక్కడో ఎలా పాల్పడ్డానో చెబుతారా ? పవన్ అంటూ అలీ ప్రశ్నించారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను ఆదుకున్నానన్న పవన్ వ్యాఖ్యలపై అలీ స్పందిస్తూ.. ఏ విధంగా తనకు సాయం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. పవన్ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే తాను మంచి పొజిషన్‌లో ఉన్న విషయాన్ని అలీ స్పష్టం చేశారు. తానెవరినీ చేయి చాచి అడగలేదని, ఎవరినీ రూపాయి కూడా అడగలేదని పేర్కొన్నారు. అలా అడిగే అవకాశం వస్తే అలీ ఉండడని అన్నారు. అల్లా దయవల్ల తాను బాగానే ఉన్నానని, దేహీ అనే స్థితికి రాలేదని అన్నారు. వైసీపీలోకి వెళ్లడం తప్పేంటి? రాజకీయ పార్టీలోకి వచ్చాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. నేను ఇప్పటివరకూ చాలా సభల్లో పాల్గొన్నా కానీ, ఎక్కడా మీ గురించి, మీ పార్టీ గురించి ఒక్క కామెంట్‌ కూడా చేయలేదు. ఎందుకంటే గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా. మీకు నా గుండెల్లో స్థానమిచ్చా. కానీ అటువంటి పవన్ నేడు తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories