అచ్చం యోగి లాంటి బాబాను తీసుకొచ్చిన అఖిలేశ్‌

అచ్చం యోగి లాంటి బాబాను తీసుకొచ్చిన అఖిలేశ్‌
x
Highlights

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇవాళ అచ్చం సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను పోలిన ఓ ''బాబా''ను పరిచయం చేశారు. యోగి...

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇవాళ అచ్చం సీఎం యోగి ఆదిత్యనాధ్‌ను పోలిన ఓ ''బాబా''ను పరిచయం చేశారు. యోగి మాదిరే ఈ బాబా కూడా పూర్తిగా కాషాయ వస్త్రాలను ధరించారు. అంతేకాదు తలను కూడా పూర్తిగా షేవ్ చేసుకున్నారు. అయితే, ఆయన ముఖాన్ని మాత్రం అఖిలేశ్ చూపించలేదు. తన పక్కన బాబా ఉన్న ఫొటోలను ట్విట్టర్ ద్వారా అఖిలేశ్ షేర్ చేశారు. 'మేము నకిలీ దేవుడిని తీసుకురాలేదు. ఒక బాబాను తీసుకొచ్చాం. గోరఖ్ పూర్ నుంచి ఆయన మాతో పాటు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసలైన నిజాలన్నింటినీ ఉత్తరప్రదేశ్ లోని అందరికీ వివరిస్తారు' అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories