logo

సమ్మర్ ఎఫెక్ట్: కారుని ఆవు పేడతో అలికేసింది...

సమ్మర్ ఎఫెక్ట్: కారుని ఆవు పేడతో అలికేసింది...
Highlights

ఆవు పేడతో కలిగే ప్రయోజనాలను ముందుగా మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు మన ఇళ్లలో నేలను, గోడలను పేడతో అలికేవారు....

ఆవు పేడతో కలిగే ప్రయోజనాలను ముందుగా మనం తెలుసుకోవాలి. ఒకప్పుడు మన ఇళ్లలో నేలను, గోడలను పేడతో అలికేవారు. వాకిలో పేడతో కలాపు చల్లేవారు. కాలం గడిచే కొద్ది ఈ అవన్నీ పోయాయి . అయితే, పేడవల్ల కలిగే ప్రయోజనాలు గురించి మళ్లీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న జనం.. మళ్లీ ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వేసవిలో ఇల్లు చల్లగా, సీతాకాలంలో వెచ్చగా ఉండేందుకు పేడతో ఇళ్లను అలికేవారు.

ఇక కారు విషయానికి వస్తే.. ఈ వేసవిలో కారులో ఏసీ లేకుండా ప్రయాణించడం అంటే గగనమే. ఎండ వేడికి కారంతా హీటెక్కిపోయి వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో అహ్మదాబాద్‌కు చెందిన సెజల్ షా అనే మహిళకు కత్తిలాంటి ఐడియా వచ్చింది. ఎండలోనూ ప్రయాణం చల్లగా ఉండేందుకు తన కారు మొత్తాన్ని పేడతో అలికేసింది...రూపేష్ గౌరంగ దాస్ ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

దీంతో ఫొటో వైరల్‌గా మారింది. ''45 డిగ్రీల ఎండ నుంచి కారును కాపాడుకోడానికి సెజల్ షా ఆమె కారును ఆవు పేడతో అలికేశారు'' అని పోస్టులో పేర్కొన్నాడు. దీంతో నెటిజన్స్ ఆమె తెలివిని తెగ మెచ్చేసుకుంటున్నారు. భలే 'కూలింగ్ హ్యాక్' అంటూ పొగిడేస్తున్నారు. ఐడియా బాగుంది..


లైవ్ టీవి


Share it
Top