మరోసారి భారీ కుదుపుకు అధికార పార్టీ సిద్ధమయిందా..?

మరోసారి భారీ కుదుపుకు అధికార పార్టీ సిద్ధమయిందా..?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఝలక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.తెలంగాణ రాజకీయాలలో మరోసారి భారీ కుదుపుకు అధికార పార్టీ సిద్ధమయిందా...? ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నేతలను కారేకించేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంతుందా..? టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ కి చెందిన అజారుద్దీన్ త్వరలో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు పరిశీలిస్తే, అజర్ హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి, కారెక్కనున్నారని తెలుస్తోంది.

జాతీయస్థాయిలో పేరున్న అజారుద్దీన్ ను తెలంగాణ కాంగ్రెస్ లో కీలకం చేయాలని భావించి ఎన్నికల తరువాత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. ఆయన్ని తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోటీ చేయించాలని ప్రయత్నం జరిగినట్లు పార్టీలో చర్చ జరిగింది. అయితే, అజర్ కారెక్కి, సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రంగంలో ఉంటారని ప్రచారం జరగడంతో హస్తం పార్టీలో అలజడి మొదలయింది. నిన్న మొన్నటి వరకు కేవలం రాష్ట్రస్థాయి నేతలను టీఆర్ఎస్ లోకి చేరుచుకున్న గులాబీ పార్టీ తాజాగా జాతీయస్థాయిలో పేరున్న అజారుద్దీన్ ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుందని చర్చ జరుగుతోంది.

అజారుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముస్లిం నేతకు ప్రాధాన్యత ఇచ్చామని చేపడంతో పాటు కాంగ్రెస్ ను దెబ్బతీశామనే భావన కల్పించస్తుందానికి టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. అజర్ కు సికింద్రాబాద్ పార్లమెంటు టికెట్ కేటాయించి, అక్కడ నుంచి పోటీ చేయించి హైదరాబాద్ లో ఉన్న ముస్లిం ఓట్లు కొల్లగొట్టడాని ప్రయత్నం చేస్తోంది. అజారుద్దీన్ టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా దేశవ్యాప్తంగా తమ పార్టీకి గుర్తింపు వస్తుందని భావిస్తోంది. దీంతో అజారుద్దీన్ ను కారెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే, కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా నష్టం జరిగే ప్రమాదముంది. ఇప్పటికే అజారుద్దీన్ కు సంబందించిన సన్నిహిత నేతలు గులాబీ గూటికి చేరడంతో, వారితో టీఆర్ఎస్ పార్టీ రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories