సైకిల్‌ను ఢీకొని తుక్కైన కారు..

సైకిల్‌ను ఢీకొని తుక్కైన కారు..
x
Highlights

సాధారణంగా ఒక సైకిల్, కారును ఢీకొడితే ఏమౌతుందో అందరికి తెలిసిన ముచ్చటనే కదా! సైకిల్ పొట్టు పొట్టు అయితది. కాని దక్షిణ చైనాలోని షెంజన్‌ నగరంలోని చోటుచేసుకున్న ఘటన ఇప్పడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఒక సైకిల్, కారును ఢీకొడితే ఏమౌతుందో అందరికి తెలిసిన ముచ్చటనే కదా! సైకిల్ పొట్టు పొట్టు అయితది. కాని దక్షిణ చైనాలోని షెంజన్‌ నగరంలోని చోటుచేసుకున్న ఘటన ఇప్పడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అతివేగంగా వచ్చిన ఓ సైకిల్ కారు ఢీకొట్టింది దింతో కారు బంపర్ ధ్వంసమైంది. ఇక దీనికి సంబంధించిన, వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మరేపుతున్నాయ్, ఈ ఘటనలో కారు ముందున్న బంపర్ మొత్తం లోపకి అతుక్కపోయింది. కాగా కారుకే అంతపెద్దగా అయిందంటే సైకిల్‌కు మాత్రం చిన్న గిత కూడా పడలేదట. అందుకే ఈ వార్తా అందరినీ దిమ్మెతిరిగేలా చేస్తుంది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు చప్పడు చేయకుంట ఉంటారా? చూసినా ప్రతిఒక్కరు హే గిట్ల ఎట్ల అయితది? ఈ ఫోటో ఉత్త ఫేక్ అని కొట్టిపరేస్తున్నారు. ఇంకా కొంతమంది మాత్రం అసలు సైకిలు ఢీకొడితే కారు అలా అవుతుందా అని సందేహపడుతున్నారు. అయితే దినిపై అక్కడి పోలీసులు స్పందిస్తూ ఈ ఘటన నిజంగానే జరిగిందంటూ స్పష్టం చేశారు. ఇక సైక్లిస్ట్‌కు మాత్రం చిన్నపాటి దెబ్బలు తగిలాయని, అయితే కారులో ఉన్న వారికి మాత్రం ఒక్క స్వల్వ గాయాలు కూడా కాలేదని వెల్లడించారు. అయితే ఈ సైకిల్‌ను దేనితో తయారు చేశార్రా బాబూ అని అనుకుంటున్నారట జనాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories