పంచాయతీ ఎన్నికల్లో ఆదివాసీలకు పట్టం కట్టిన సర్కార్

kcr
x
Kalvakuntla Chandrasekher Rao
Highlights

ఆదివాసీలకు అధికారం అందనుంది 100శాతం ఆదివాసీలు నివసిస్తున్న గ్రామాలకు వారే సర్పంచులుగా వ్యవహరించనున్నారు దీంతో తండాల్లో గిరిజన రాజ్యం రానుంది స్థానిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఆదివాసీలకు అధికారం అందనుంది. 100శాతం ఆదివాసీలు నివసిస్తున్న గ్రామాలకు వారే సర్పంచులుగా వ్యవహరించనున్నారు దీంతో తండాల్లో గిరిజన రాజ్యం రానుంది స్థానిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

తెలంగాణ సర్కార్ గిరిజనులకు జైకోట్టింది. 500 జనాభా ఉన్నాగూడాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ‌గా సర్పంచ్ పదవులు ఆదివాసీలకు దక్కనున్నాయి. జిల్లాలో మొత్తం 467లో గ్రామపంచాయతీలు ఉన్నాయి. పేసా యాక్టు ప్రకారం గిరిజనులు అత్యదికంగా నివశిస్తున్న ప్రాంతాలలో వారికే స్థానిక పదవులు ఇవ్వాలి. ‎దీంతో జిల్లాలో ఎజేన్సిలో 262 గ్రామపంచాయితీలు గిరిజనులకే దక్కాయి. నాన్ ఏజెన్సీల్లో 30 సర్పంచ్ స్థానాలకు గిరిజనులు రిజర్వు చేశారు గిరిజనులకు సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కావడంతో గిరిజన సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఇక కొమరం భీమ్ జిల్లాలో 334 గ్రామ పంచాయతీలున్నాయి వీటిలో షెడ్యూల్ 162, నాన్ షెడ్యూల్ 164 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో 311 గ్రామపంచాయితీలుగా 35 షెడ్యూల్డ్ పంచాయతీలు కాగా, 100 శాతం గిరిజనులు ఉన్న పంచాయతీలు మూడు ఉన్నాయి నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయితీ ఉండగా 35 చోట్ల 100 శాతం గిరిపుత్రులు ఉన్నారు మిగిలిన స్థానాల్లో బీసీ, ఎస్సీ, జనరల్ వర్గాలకు కేటాయించారు.

మరోవైపు మేజర్ గ్రామపంచాయితీలు ఆదివాసీలకు దక్కకుంట్రా కుట్ర జరుగుతోందని ఆదివాసీ సంఘాలు ఆందోళ చేస్తున్నాయి మెజర్ గ్రామపంచాయితీ నుండి గూడాలను విడదీసి కోత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల మేజర్ పంచాయతీలకు ఆదివాసీలు దూరం అవుతున్నారని ఆరోపిస్తున్నాయి వాటిని కూడా ఆదివాసీలకే కేటాయించాలని గరిజనులు కోరుతున్నారు. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తండా పంచాయతీల్లో సర్పంచులు వందశాతం గిరిజనులకే ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇక గిరిజనులకు దక్కాల్సిన మరికొన్ని పంచాయతీలు కూడా తమకే కేటాయించాలని కోరుతున్నారు.ఆదివాసీలకు అధికారం అందనుంది 100శాతం ఆదివాసీలు నివసిస్తున్న గ్రామాలకు వారే సర్పంచులుగా వ్యవహరించనున్నారు దీంతో తండాల్లో గిరిజన రాజ్యం రానుంది స్థానిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.ఆదివాసీలకు అధికారం అందనుంది 100శాతం ఆదివాసీలు నివసిస్తున్న గ్రామాలకు వారే సర్పంచులుగా వ్యవహరించనున్నారు దీంతో తండాల్లో గిరిజన రాజ్యం రానుంది స్థానిక ఎన్నికల సమరం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపుపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

Show Full Article
Print Article
Next Story
More Stories