భవిష్యత్‌లో డేటా ద్వారానే సంపద సృష్టి : చంద్రబాబు

భవిష్యత్‌లో డేటా ద్వారానే సంపద సృష్టి : చంద్రబాబు
x
Highlights

భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వానికి అదాని గ్రూప్‌కు మధ్య ఎంవోయూ కుదిరింది.

భవిష్యత్తులో డేటా ద్వారానే సంపద సృష్టి జరుగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వానికి అదాని గ్రూప్‌కు మధ్య ఎంవోయూ కుదిరింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పారిశ్రామికవేత్త అదాని, విజయానంద్ ఇవాళ అమరావతిలో భేటీ అయి డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్క్‌ల అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వినూత్న ఆవిష్కరణలు, భావి ఫలితాలు డేటా ద్వారానే జరుగుతాయన్నారు. యువత భవిష్యత్తు అంతా డేటా ద్వారానేనని, డేటా ద్వారానే వినూత్న ఆవిష్కరణలు జరుగుతాయని చెప్పారు. వైజ్ఞానిక ఆర్ధిక వ్యవస్థదే భవిష్యత్తు అని, నాలెడ్జ్ ఎకానమీకి ఐటీయే ముఖ్యమని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా సెంటర్ కీలకమని, గతంలో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేశామని చెప్పారు. ఇప్పుడు ఏపీని డేటా హబ్ చేస్తున్నామని చెప్పారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories